గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న అలీ.

Published on Aug 1, 2020 7:12 pm IST


రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ సారధ్యంలో ముందుకు వెళ్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని కమెడియన్ అలీ అన్నారు. బక్రీద్ పండుగ పురస్కరించుకొని మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ మణికొండలోని తన ఇంటి పరిసర ప్రాంతాలలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు అలీ. ఎంపి సంతోష్ కుమార్ మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అలీ పేర్కొన్నారు. అనంతరం మరో ఇద్దరికి ఆయన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ విసిరారు. సోదరుడు, సినీ ఆర్టిస్ట్ ఖయుమ్, అలీ బావమరిది కరీంకు గ్రీన్ ఛాలెంజ్ చేపట్టి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

ఇప్పటికే అనేక మంది టాలీవుడ్ సెలెబ్రటీలు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగం కావడం ఆనందించ దగ్గ విషయమే. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ సత్కార్యం మంచి ఫలితాలను ఇస్తుంది.

సంబంధిత సమాచారం :

More