పవన్ ఆర్ధిక సాయంతో నటుడు ఫిష్ వెంకట్ ఎమోషనల్

టాలీవుడ్ స్టార్ హీరో అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇపుడు ఈ రెండు రంగాల్లో కూడా బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే పవన్ నిజ జీవితంలో ఎంతోమంది సినీ సహా బయట ప్రజలకి కూడా ఎన్నోమార్లు ఆర్ధిక సాయం చేసిన ఘటనలు కోకొల్లలు. అయితే పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా మన టాలీవుడ్ ప్రముఖ నటుడు విలన్ అలాగే కామెడీ పాత్రల్లో కూడా అలరించిన ఫిష్ వెంకట్ కి ఆర్ధిక సాయం అందించిన ఘటన బయటకి వచ్చింది.

గత కొన్నాళ్ల నుంచి ఫిష్ వెంకట్ కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధ పడుతుండగా తన భార్య మాట విని పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడితే మొత్తం కళ్యాణ్ గారు చూసుకుంటా అన్నారు అని అలాగే వెంటనే ఆర్ధిక సాయంగా 2 లక్షల రూపాయలు తన కోసం జమ చేశారు అని తనకు ఈ కష్టకాలంలో ఆదుకున్న పవన్ కళ్యాణ్ తన కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నాను అంటూ ఫిష్ వెంకట్ ఎంతో ఎమోషనల్ గా మాట్లాడిన వీడియో ఇపుడు అభిమానుల్లో వైరల్ గా మారింది.

Exit mobile version