పవన్ సినిమాపై మరింత క్లారిటీ.!

Published on Jun 4, 2020 7:11 pm IST


ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం “వకీల్ సాబ్”. అయితే ఈ చిత్రం తర్వాత కూడా పవన్ కొన్ని ప్రాజెక్టులను లైన్ లో పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అలా లైన్ లో పెట్టిన వాటిలో విలక్షణ దర్శకుడు క్రిష్ తో ప్లాన్ చేసిన పీరియాడిక్ డ్రామా కూడా ఒకటి.

ఈ సినిమాను కూడా పవన్ ఫ్యాన్స్ మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి అప్పట్లో పలు కీలక అంశాలు వినిపించాయి. అలా ఇప్పుడు మళ్ళీ మరో తాజా అంశం బయటకొచ్చింది.

ఈ చిత్రంలో ప్రముఖ నటుడు జైరాం కూడా నటిస్తున్నారని తెలిపారు. అలాగే ఈ చిత్రం 18వ దశకంలో ఉంటుందని అంతే కాకుండా ఈ సినిమాకు భారీ క్యాస్టింగ్ మరియు యుద్ధ సన్నివేశాలకు నిజమైన గుర్రాలతో యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయని మరింత క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత సమాచారం :

More