2024లో బిగ్గెస్ట్ సూపర్‌హిట్ మూవీ ‘విశ్వం’ – నరేష్

మ్యాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘విశ్వం’ మూవీ దసరా బరిలో రిలీజ్ అయ్యింది. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్సిడ్ రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ నటిస్తున్నట్లుగా టీజర్, ట్రైలర్లలో చూపెట్టడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపారు.

అయితే, ఈ సినిమా విజయం సాధించిందని మేకర్స్ తాజాగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ మీట్‌లో సీనియర్ నటుడు నరేష్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.‘‘విశ్వం సినిమాను ప్రేక్షకులు ఆదరించినందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమాలోని కమర్షియల్ అంశాలు ప్రేక్షకులను బాగా అలరించాయి. ఈ సినిమాలో నటించిన తోటి నటీనటులు, టెక్నీషియన్స్ అందరికీ ధన్యవాదాలు. ఈ దసరా బరిలో రిలీజ్ అయిన సినిమాల్లో విశ్వం సూపర్ హిట్‌గా నిలిచింది. 2024లోనే సూపర్ హిట్ మూవీగా విశ్వం నిలిచింది.’’ అని నరేష్ అన్నారు.

ఓ మిశ్రమ రెస్పాన్స్ తెచ్చుకున్న సినిమాపై నరేష్ ఇలాంటి కామెంట్స్ చేయడంతో నెట్టింట ఆయనపై తెగ ట్రోలింగ్ జరుగుతోంది. 2024లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయని.. వాటిని నరేష్ చూడకుండానే తమ సినిమాను సూపర్ హిట్ అనుకోవడం ఏమిటని పలువురు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

Exit mobile version