మలయాళం హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ బ్లెస్సి దర్శకత్వం లో తెరకెక్కిన సర్వైవల్ డ్రామా ది గోట్ లైఫ్ (తెలుగు లో ఆడు జీవితం). ఈ చిత్రం మార్చి 2024 లో థియేటర్ల లో రిలీజ్ కి రెడీ అయ్యింది. ఈ చిత్రం లో నటించిన హీరో పృథ్వీ రాజ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
మెగాస్టార్ చిరంజీవి తనకు రెండు సార్లు తన సినిమాల్లో అవకాశం ఇచ్చారు అని పేర్కొన్నారు. హిస్టారికల్ మూవీ అయిన సైరా నరసింహ రెడ్డి లో ఒక పాత్ర కోసం తనను సంప్రదించిన విషయాన్ని వెల్లడించారు. నటించాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ, సర్ నేను ఆడు జీవితం అనే ఒక చిత్రం చేస్తున్నా, లార్జర్ దేన్ లైఫ్ అని పేర్కొన్న విషయాన్ని తెలిపారు. కాల్షీట్లు ఆ చిత్రం కోసం కేటాయించినట్లు తెలిపారు. కొన్నేళ్ల తర్వాత లూసిఫర్ రీమేక్ అయిన గాడ్ ఫాదర్ లో ఒక కే రోల్ కోసం అడగగా, ఆడు జీవితం చిత్రం కి సంబందించి వేరే పనుల్లో బిజీగా ఉన్న విషయాన్ని తెలిపారు. పృథ్వీ రాజ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.