తమిళ స్టార్ హీరో సూర్య పుట్టిన రోజు నేడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సూర్య ఫ్యాన్స్ హడావుడే కనిపిస్తోంది. సూర్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంలో అభిమానులు ఫుల్ బిజీ అయిపోయారు. అలాగే సినీ ప్రముఖుల్లో కొందరు సూర్యకి బర్త్ డే విషెస్ చెబుతూ మెసేజ్ లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే.. సూర్యని గతంలో నటుడు రఘువరన్ తిట్టిన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇంతకీ, అసలేం జరిగింది అంటే.. ‘నటన రాని వ్యక్తి. తండ్రి పేరు మీద ఇండస్ట్రీకి వచ్చినవాడు’ అంటూ గతంలో హీరో సూర్యని విమర్శించేవారు. ఈ నేపథ్యంలో ఓ రోజు సూర్య, దివంగత నటుడు రఘువరన్ కలిసి రైల్లో ప్రయాణం చేస్తున్నారట. ఐతే, సూర్య షూటింగ్ గురించి ఏ మాత్రం ఆలోచించకుండా నిద్రపోతున్నారట. వెంటనే సూర్యను రఘు లేపి ‘ఎలా నిద్రపడుతోందిరా నీకు? ఇంకెంత కాలం మీ నాన్న పేరు చెప్పుకొని బతుకుతావ్ ?’ అని తిట్టారట. ఆ తర్వాత కాలంలో పట్టుదలగా సూర్య తనను తాను సూపర్ స్టార్ గా మలచుకున్నారట.