‘కోర్ట్’ సినిమాపై శరత్ కుమార్ ఇంట్రెస్టింగ్ రివ్యూ!

రీసెంట్ గా మన తెలుగు సినిమా దగ్గర రిలీజ్ కి వచ్చి సెన్సేషనల్ హిట్ అయ్యిన చిత్రాల్లో యువ దర్శకుడు రామ్ జగదీశ్ తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ చిత్రం “కోర్ట్” కూడా ఒకటి. టాలెంటెడ్ నటీనటులు ప్రియదర్శి, సాయి కుమార్ అలాగే హర్ష వర్ధన్ ఇంకా యువ నటులు హర్ష రోహన్ మరియు శ్రీదేవి ఆపళ్ళ నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యి రీసెంట్ గానే పాన్ ఇండియా భాషల్లో ఓటిటికి వచ్చింది.

అయితే ఈ సినిమాపై ప్రముఖ నటుడు శరత్ కుమార్ ప్రశంసల వర్షం కురిపించారు. “నిన్న రాత్రే కోర్ట్ అనే తెలుగు సినిమా చూడడం జరిగింది. ఇదొక ఎక్సలెంట్ సినిమా. ప్రతీ ఒక్కరు చూడాల్సిన, ఆ అంతకుమించి తెలుసుకోవాల్సిన సినిమా ఇది. ఒక చదువు రాని వ్యక్తి కూడా చట్టం కోసం తెలుసుకోవాలి అని అనే పాయింట్ అద్భుతంగా ఉంది. ఇంకా ఈ సినిమాలో ఎన్నో ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి.

మనం నిర్ణయాలు ఎలా తీసుకోవాలి అనే అంశాన్ని ఈ చిత్రం నేర్పింది. ఎప్పటికీ వెనకడుగు అనేది వెయ్యకూడదు, నిజమే ఎప్పటికైనా నెగ్గుతుంది అనే అంశాలు ఉన్నాయి. చిత్ర యూనిట్ కి అలాగే దర్శకుడు రామ్ జగదీశ్ కి నా అభినందనలు తెలుపుతున్నాను అని శరత్ కుమార్ ఇచ్చిన ఇంట్రెస్టింగ్ రివ్యూ ఇపుడు వైరల్ గా మారింది.

Exit mobile version