“టైగర్ నాగేశ్వర రావు” ట్రైలర్ పై తేజ సజ్జ కామెంట్స్!

“టైగర్ నాగేశ్వర రావు” ట్రైలర్ పై తేజ సజ్జ కామెంట్స్!

Published on Oct 3, 2023 6:03 PM IST

మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ వంశీ రచన, దర్శకత్వం లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ టైగర్ నాగేశ్వర రావు. ఈ చిత్రం కి సంబందించిన ట్రైలర్ ను మేకర్స్ నేడు రిలీజ్ చేయడం జరిగింది. ఈ ట్రైలర్ కి ఆడియెన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ పై టాలీవుడ్ యంగ్ యాక్టర్ తేజ సజ్జ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.

ట్రైలర్ చూడటానికి ఫెంటాస్టిక్ గా ఉంది అని, బిగ్ స్క్రీన్ పై చూడటానికి వేచి ఉండలేను అని పేర్కొన్నారు. అంతేకాక హీరో రవితేజ కి, ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ కి, డైరెక్టర్ వంశీ లకి బెస్ట్ విషెస్ తెలిపారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు