తన భర్తతో విడాకులపై స్పందించిన నటి ఆమని

తెలుగు సినిమా ప్రముఖ నటి ఆమని కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె తన మొదటి సినిమాతోనే హీరోయిన్ గా టాలీవుడ్ భారీ సక్సెస్ ని అందుకున్నారు అలా ఒక టైం లో సాలిడ్ క్రేజ్ ని ఆమె అందుకోగా తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి రీఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు జెనరేషన్ కి తగ్గ పాత్రలు చేస్తూ బిజీగా ఉన్న ఆమెపై కొన్ని వార్తలు ఇటీవల వైరల్ గా మారాయి. ఆమె తన భర్త నుంచి విడిపోతున్నట్టుగా కొన్ని పుకార్లు రాగా వాటిపై ఆమె తాజాగా స్పందించారు.

తాను విడాకులు తీసుకుంటున్నట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని తన భర్తకు విడాకులు ఇచ్చే ప్రసక్తి లేదని తను తన భర్త తోనే కలిసి జీవనం కొనసాగిస్తాను అని తెలిపారు. సో ఆమెపై వస్తున్న ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఇప్పుడు తేలిపోయింది. ఇక ప్రస్తుతం ఆమని పలు టాలీవుడ్ సినిమాల్లో ఇప్పుడు బిజీగా ఉన్నారు.

Exit mobile version