కల్కి: ప్రభాస్ తో సెల్ఫీ పిక్ ను షేర్ చేసిన ఫరియా అబ్దుల్లా!

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి (Kalki2898AD). వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రంలో దీపికా పదుకునే, దిశా పటాని ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటించగా, యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం నేడు వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. అన్ని చోట్ల నుండి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

అయితే ఈ చిత్రంలో గెస్ట్ రోల్ లో కనిపించిన ఫరియా అబ్దుల్లా తాజాగా సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను షేర్ చేయడం జరిగింది. ఏం చేసావ్ నాగ్ అశ్విన్? ఇప్పుడే కల్కి 2898AD చూసాను. మళ్ళీ వెంటనే చూడాలని అనిపిస్తుంది అని అన్నారు. అంతేకాక ఇందులో భాగం అయినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభాస్ తో దిగిన సెల్ఫీ ను షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటో ఆడియెన్స్ ను, ఫ్యాన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. తన గెటప్ కి సంబందించిన ఫోటో ను కూడా షేర్ చేయడం జరిగింది.

ఈ చిత్రంలో బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Exit mobile version