జస్టిస్ హేమ కమిటీ రూపొందించిన నివేదిక ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు నటీమణులు తమకు ఎదురైన చేదు సంఘటనల గురించి ధైర్యంగా బయట పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నటి మిను తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తెలియజేసింది. ఆమె సోషల్మీడియాలో పోస్టు పెడుతూ.. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు నటుల వల్ల తాను వేధింపులకు గురయ్యాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఇంతకీ, నటి మిను ఏం పోస్ట్ చేసిందంటే.. ‘ముఖేశ్, మణియన్పిళ్ల రాజు, ఇడవేల బాబు, జయసూర్య, ప్రొడక్షన్ కంట్రోలర్ నోబల్, విచు వల్ల నేను వేధింపులు ఎదుర్కొన్నాను. అసభ్య పదజాలంతో వారు నన్ను దూషించారు. 2013లో ఒక ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఈ పరిస్థితులు ఎదురయ్యాయి. అన్నింటినీ తట్టుకొని సినిమా కోసం వర్క్ చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ వారి వేధింపులు దారుణంగా ఉండేవి. ఒక విధంగా నేను మలయాళం చిత్రపరిశ్రమను వదిలి చెన్నైకు వెళ్లిపోయింది వారి వల్లే. నాకు న్యాయం జరగాలి. వారికీ తగిన శిక్ష పడాలి’ అని నటి మిను తన పోస్ట్ లో రాసుకొచ్చింది.