యానిమల్ పై త్రిష పోస్ట్ వైరల్

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ లాంటి టాలెంటెడ్ హీరో కలయికలో వచ్చిన సినిమా యానిమల్. ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో దూసుకుపోతోంది. ఐతే, ఈ యానిమల్‌ సినిమాలో స్త్రీలను తక్కువగా చూపించారంటూ కొంతమంది నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ తో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ త్రిష యానిమల్ సినిమా ‘ఒకటే పదం-కల్ట్’ అంటూ తన ఇన్‌స్టా లో పోస్ట్ పెట్టింది. దీంతో, త్రిష పోస్టు పైనా విమర్శలు వెల్లువెత్తున్నాయి.

వారం క్రితమే మహిళల గౌరవం గురించి మాట్లాడి, ఇప్పుడు యానిమల్‌ సినిమాను పొగుడుతున్నారా అంటూ పలువురు నెటిజన్లు త్రిష ను ఎద్దేవా చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. ఈ నెగిటివ్ కామెంట్స్ చూసిన త్రిష, ఆ వెంటనే తన పోస్ట్ ను తొలగించింది. ప్రస్తుతం ఇది నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ యానిమల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుండగా.. కేవలం రెండు రోజుల్లోనే రూ.236 కోట్లు వచ్చినట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Exit mobile version