Devara: ‘దేవర’ ఒరిజినల్ రన్‌టైమ్ ఇదే!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) మరో మూడు రోజుల్లో బాక్సాఫీస్ భరతం పట్టేందుకు సిద్ధమయ్యాడు. ‘దేవర’(Devara) వరల్డ్‌వైడ్ రిలీజ్ సెప్టెంబర్ 27న ఉండటంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపు 6 సంవత్సరాల తరువాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సోలో మూవీ కావడంతో ఈ చిత్రంపై అంచనాలు పీక్స్‌కి చేరాయి.

ఇక ఈ సినిమాలోని కథ ప్రేక్షకులను థ్రిల్ చేయనుందని మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్‌లో చెబుతూ వస్తున్నారు. కాగా, ఈ సినిమా రన్‌టైమ్ విషయంలో చాలా వార్తలు వచ్చాయి. అధికారికంగా చిత్ర యూనిట్ కూడా ఇది లెంగ్తీ రన్‌టైమ్‌తో వస్తుందని చెప్పారు. అయితే, సినిమా అసలు నిడివి ఎంత అనేది ఇప్పుడు తేలిపోయింది. ‘దేవర’ టోటల్ రన్‌టైమ్ 2 గంటల 50 నిమిషాల 58 సెకన్లుగా లాక్ అయ్యింది. అయితే, ఇందులో సామాజిక భద్రతకు సంబంధించిన వార్నింగ్ యాడ్స్ కూడా కలిపారు. అవి కాకుండా కేవలం ‘దేవర’ చిత్ర రన్‌టైమ్ మాత్రమే చూసుకుంటే, ఇది 2 గంటల 42 నిమిషాలుగా ఉందని తెలుస్తోంది.

ఏదేమైనా లెంగ్తీ రన్‌టైమ్‌తో వస్తున్న ‘దేవర’ రెండు భాగాలుగా రానుంది. మరి ఫస్ట్ పార్ట్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనే విషయం మరో మూడు రోజుల్లో తేలిపోనుంది. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు.

Exit mobile version