హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాబిన్‌హుడ్’ క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాను దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో నితిన్ పాత్ర ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే అర్థమవుతుంది.
ఇక ఈ సినిమా నుండి ‘అదిదా సర్‌ప్రైజ్’ అనే ఐటెం సాంగ్‌ని రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ పాట రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. టెక్నికల్ సమస్య వల్ల ఈ పాట రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. త్వరలోనే ఈ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని వారు తెలిపారు.
ఈ సినిమాలో నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.
Due to technical issues, the #Robinhood Second Single, #AdhiDhaSurprisu Song will not be released as planned. It will be out soon!
Meanwhile, keep vibing to #OneMoreTime on loop ❤️????
▶️ https://t.co/2V1vD01jU9GRAND RELEASE WORLDWIDE ON DECEMBER 25th ????@actor_nithiin… pic.twitter.com/SPYHptD1DY
— Mythri Movie Makers (@MythriOfficial) December 10, 2024