టాలీవుడ్ యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా, డైరెక్టర్ శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఆదికేశవ. యంగ్ బ్యూటీ శ్రీ లీల ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. నవంబర్ 10, 2023 న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్.
నేడు ఈ సాంగ్ రిలీజ్ కి సంబందించిన ఈవెంట్ మధ్యాహ్నం 2 గంటలకు షురూ కానుంది. హైదరాబాద్ లోని మల్లారెడ్డి కాలేజ్ లో ఈ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.