“ఆదిపురుష్” రిలీజ్ విషయంలో మేకర్స్ సాలిడ్ క్లారిటీ.!

Published on Oct 5, 2022 8:00 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ హీరోయిన్ గా దర్శకుడు ఓంరౌత్ కాంబోలో తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా “ఆదిపురుష్”. రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం టీజర్ కి గాను మిక్సిడ్ రెస్పాన్స్ అయితే వచ్చింది.

దీనితో ఇక్కడ నుంచి సినిమాపై కొన్ని రూమర్స్ అయితే స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి సినిమా రిలీజ్ వాయిదా ఉండొచ్చు అని పలు అనుమానాలు అయితే స్టార్ట్ కాగా అదేమీ లేదు అన్నట్టుగా మేకర్స్ ఇప్పుడు పదే పదే రిలీజ్ డేట్ జనవరి 12 నే ఉంటుంది అని నొక్కి చెబుతున్నారు.

దీనితో అయితే రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ మాత్రం పక్కా క్లారిటీగా ఉన్నారని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ అలాగే సన్నీ సింగ్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా వరల్డ్ వైడ్ ఐమ్యాక్స్, 3D లలో సహా ఇంగ్లీష్ లో కూడా ఈ చిత్రం రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :