“ఆదిపురుష్” టీం స్పీడ్ పెంచాల్సిందేనా.!

Published on May 31, 2023 1:58 pm IST


ప్రస్తుతం పాన్ ఇండియా వీక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “ఆదిపురుష్”. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ భారీ విజువల్ ట్రీట్ ని దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించగా ప్రభాస్ ప్రభు శ్రీరామునిగా కృతి సనన్ మాత జానకి దేవిగా అయితే నటించారు. ఇక బిగ్ స్క్రీన్స్ పై విట్నెస్ చేయాలని చూస్తున్న ఫ్యాన్స్ మాత్రం మేకర్స్ ప్రమోషన్స్ విషయంలో మాత్రం కాస్త అసంతృప్తిగా ఉన్నారని చెప్పాలి.

ఇప్పటికే ఎన్నో పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న రెండు లేదా ఒక నెల ముందే ఎలా లేదన్నా ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసేస్తారు కానీ ఆదిపురుష్ కి ఇంకా రెండు వారాల వ్యవధి మాత్రమే ఉన్నా చిత్ర యూనిట్ నుంచి పాన్ ఇండియా వైడ్ గా ప్రమోషన్లే కనిపించడం లేదు. తెలుగు, హిందీ అంటే పర్వాలేదు కానీ మిగిలిన ముఖ్య భాషల్లో అగ్రెసివ్ ప్రమోషన్స్ తప్పనిసరి.

గతంలో ప్రభాస్, బాహుబలి 2, సాహో చిత్రాలకి ప్రభాస్ లెక్కలేనన్ని ఇంటర్వ్యూ లు ప్రమోషన్స్ కోసం అనేక టూర్స్ కూడా వేసాడు. మరి ఇది మాత్రం ఆదిపురుష్ విషయంలో బాగా లేట్ అయ్యిందనే చెప్పాలి. ఇక ఈ జూన్ నుంచే ప్రభాస్ అండ్ టీం అయితే ఈ ప్రమోషన్స్ అన్నీ స్టార్ట్ చేయనున్నారని తెలుస్తుంది. మరి వీటిని ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :