ఈ క్రైమ్ థ్రిల్లర్ సీక్వెన్స్ కు అడవి శేష్.?

Published on Nov 29, 2020 10:06 pm IST

ఇప్పుడు మన టాలీవుడ్ లో యువ దర్శకుల హవా నడుస్తుంది. తమ టాలెంట్ పలు ఆసక్తికర సినిమాలను తెలుగు ఆడియెన్స్ కు అందిస్తూ వస్తున్నారు. అలా మన యువ దర్శకుడు శైలేష్ కొలను “హిట్” అనే చిత్రంతో మంచి హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. టాలీవుడ్ లో మరో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ కు కూడా మంచి హిట్ లా ఈ చిత్రం నిలిచింది.

నాచురల్ స్టార్ నాని నిర్మాతగా తెరకెక్కించిన ఈ చిత్రంకు మంచి రెస్పాన్స్ అందుకోగా ఈ చిత్రంకు సీక్వెన్స్ కూడా ఉంటుంది అని ఖరారు అయ్యింది. కానీ ఇపుడు లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ సీక్వెన్స్ లో విశ్వక్ సేన్ మెయిన్ లీడ్ లో కనిపించడం లేదని తెలుస్తుంది. మరి ఈ రోల్ ను మన టాలీవుడ్ లో మంచి ఇంట్రెస్టింగ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన హీరో అడివి శేష్ ఈ రోల్ ను భర్తీ చేయనున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై సరైన క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More