మంచి మనసు చాటుకున్న అడివి శేష్

మంచి మనసు చాటుకున్న అడివి శేష్

Published on Jul 20, 2024 11:00 PM IST

విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు అడివి శేష్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. కంటెంట్ ఉన్న సినిమాలను తెరకెక్కించడమే కాకుండా, వాటిని బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్‌లుగా మలచడంలో అడివి శేష్‌కు మంచి పేరుంది. ఈ హీరో తాజాగా తన మంచి మనసును చాటుకోవడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ చిన్నారితో ఒక రోజు మొత్తం గడిపాడు శేష్. తన అభిమాని అయిన ఈ అమ్మాయి గురించి తెలుసుకున్న అడివి శేష్, వెంటనే ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆమె పరిస్థితి గురించి తెలుసుకున్నాడు. అటుపై ఆమె వీడియో కాల్స్, మెసేజ్‌లకు కూడా అడివి శేష్ స్పందిస్తూ వచ్చాడు. అయితే, ఆమెకు సడెన్ సర్‌ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో అడివి శేష్ ఆమెకు ఓ రోజు మొత్తాన్ని కేటాయించి, ఆ చిన్నారి అభిమానితో గడపడం ప్రస్తుతం అందరి ప్రశంసలను అందుకునేలా చేస్తుంది.

చిన్నారితో అడివి శేష్ గడిపిన అపురూప క్షణాలను ఆయన టీమ్ ఫోటోల రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక పలు క్రేజీ ప్రాజెక్టులతో ఈ యంగ్ హీరో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు