యంగ్ హీరో అడివి శేష్ హీరోగా నటిస్తున్న మేజర్ చిత్రం జూన్ 3, 2022న గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. శశి కిరణ్ తిక్క రచన మరియు దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ రేపు విడుదల కానుంది. ఇప్పుడు మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌తో ముందుకొచ్చారు. రేపు సాయంత్రం 04:59 గంటలకు ట్రైలర్‌ని విడుదల చేయనున్నట్లు వారు ప్రకటించారు.
ట్రైలర్‌ని ఎవరు విడుదల చేస్తారనే సమాచారం లేదు. మేజర్ చిత్రం లో సాయి మంజ్రేకర్ మరియు శోభితా ధూళిపాళ లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన ఈ బహు భాషా చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, GMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు A+S మూవీస్ పతాకాలపై సంయుక్తం నిర్మిస్తున్నారు.


