ఓటిటి సమీక్ష: ‘అడొలెసెన్స్’ – తెలుగు డబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో

ఓటిటి సమీక్ష: ‘అడొలెసెన్స్’ – తెలుగు డబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో

Published on Mar 20, 2025 1:59 PM IST

adolescence ott webseries Review In Telugu

విడుదల తేదీ : మార్చి 13, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు : స్టీఫెన్ గ్రాహమ్, ఓవెన్ కూపర్, ఎరిన్ డోహెర్టీ, ఫేయ్ మార్సే, క్రిస్టీన్ ట్రెమార్కో, అమేలీ పీస్, ఆస్టిన్ హేన్స్, మార్క్ స్టాన్లీ తదితరులు
దర్శకుడు : ఫిలిప్ బరాన్టిని
నిర్మాణం : జో జాన్సన్
సంగీతం : ఆరోన్ మే, డేవిడ్ రిడ్లే
సినిమాటోగ్రఫీ : మాథ్యూ లివీస్, లీ డేవిడ్ బ్రౌన్
ఎడిటర్ : జాస్మిన్ జాన్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

లేటెస్ట్ గా దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కి వచ్చిన సిరీస్ లలో బ్రిటిష్ సిరీస్ అడొలెసెన్స్ కూడా ఒకటి. ఓటిటి ఆడియెన్స్ లో సాలిడ్ రెస్పాన్స్ ని అందుకున్న ఈ సిరీస్ ఎలా ఉందో ఇండియన్ ఆడియెన్స్ కి కూడా నచ్చుతుందా లేదా అనేది ఇపుడు సమీక్షలో చూద్దాం.

కథ:

ఇంగ్లాండ్ లోని ఒక స్కూల్ విద్యార్థిని కేటీ లియోనార్డ్ అనే అమ్మాయిని చంపిన నేరానికి గాను తన క్లాస్ మేట్ అయ్యిన జేమీ మిల్లర్ (ఓవెన్ కూపర్) 13 ఏళ్ల కుర్రాడిని అక్కడి పోలీస్ అరెస్ట్ చేస్తారు. ఈ అరెస్ట్ తో జైలు పాలైన జేమీ కోసం తన తండ్రి ఎడ్డీ మిల్లర్ (స్టీఫెన్ గ్రాహమ్) ఏం చేశారు? అసలు ఆ మర్డర్ ని చేసింది జేమీయేనా? ఒకవేళ చేస్తే అందుకు గల కారాణాలు ఏంటి? పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో జేమీ అమాయకుడా? నిజంగానే ఆ హత్య చేశాడా లేదా? ఇంకా చివరికి తాను విడుదల అవుతాడా లేదా? ఇంకా ప్రస్తుత జెనరేషన్ లో కౌమార దశలో ఉన్న యువత చేస్తున్న తప్పులు ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ సిరీస్ ని నెట్ ఫ్లిక్స్ లో చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ సిరీస్ ని చాలామంది మంచి హైప్ ఇస్తూ పైకి లేపారు. మరి ఆ రేంజ్ లో ఉందా అంటే ఉండనే చెప్పవచ్చు. మెయిన్ గా ఈ సిరీస్ లో ప్లాట్ ఇంకా దీనిని ఆవిష్కరించిన విధానం అంటే ఆడియెన్స్ కి అసలు ఎలా ఇలా అనే భావన తీసుకొస్తుంది. నమ్మడానికి నిజంలా అనిపించపోయినా కూడా ఒకో ఎపిసోడ్ సుమారు గంట ఉంటుంది కానీ ఈ గంట పాటుగా ఎపిసోడ్ మొత్తం సింగిల్ టేక్ అండ్ సింగిల్ షాట్ లోనే అనేకమంది నటీనటుల్ని మ్యానేజ్ చేస్తూ చేయడం అనేది అద్భుతంగా అనిపించక మానదు.

ఆ మధ్య వచ్చిన ఎక్సట్రాక్షన్ అలాగే విడుదల 1 సినిమాల్లో కూడా దాదాపు 15 నుంచి 20 నిమిషాల సింగిల్ టేక్ సన్నివేశాలకే ఆడియెన్స్ ఇంప్రెస్ అయితే ఈ సిరీస్ లో ఏకంగా గంటల వ్యవధిలో ఎపిసోడ్ ని అది కూడా ఎంగేజింగ్ గా ముగించడం అనేది చాలా ఇంప్రెస్ చేసే అంశం. ఇక ఈ సిరీస్ లో ప్రధానంగా నాలుగు పాయింట్స్ ఆసక్తిగా ఉంటాయని చెప్పవచ్చు.

అరెస్ట్, ఇన్వెస్టిగేషన్, ఇంటరాగేషన్ ఇంకా చివరిలో మంచి మెసేజ్ లు ఆడియెన్స్ ని మెయిన్ గా ప్రెజెంట్ జెనరేషన్ లో యువత వారి తల్లిదండ్రులని ఆలోచించేలా చేస్తాయి. పలు వెస్ట్రన్ కంట్రీస్ స్కూల్స్ లో జరిగే బుల్లీయింగ్ వాటి ప్రభావాలు యువతని ఏ విధంగా తప్పుడు దారిలోకి తీసుకెళ్తాయి అనేవి ఈ సిరీస్ లో ఆసక్తికర ఇన్వెస్టిగేషన్ అంశాలతో కనిపిస్తాయి.

వీటితో పాటుగా సోషల్ మీడియా వల్ల జరిగే అనర్ధాలు ఏంటి అందులో పలు ఎమోజీస్ వాటికి అర్ధాలు లాంటి ఒకింత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. ఇక నటీనటుల్లో అయితే నాలుగు ఎపిసోడ్స్ లో ఓవెన్ కూపర్, స్టీఫెన్ గ్రాహమ్, ఆష్లే వాల్టర్స్ అలానే ఎరిన్ డొహెట్రో సహా క్రిస్టీన్ ట్రెమార్కో, అమేలీ పీస్ లు సాలిడ్ పెర్ఫామెన్స్ లు ఈ సిరీస్ లో కనబరిచారు అని చెప్పవచ్చు. పోలీస్ రోల్ లో ఆష్లే వాల్టర్స్ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వగా చాలా సెటిల్డ్ గా తన రోల్ చేశారు.

అలాగే మూడో ఎపిసోడ్ లో ఎరిన్ డొహెట్రో, ఓవెన్ కూపర్ నడుమ జరిగే మాటలు అందులో ఇద్దరి నటన ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. మెయిన్ గా కూపర్ ఊహించని షేడ్స్ ని ఈ ఎపిసోడ్ లో చూపిస్తాడు. ఇక ఫైనల్ ఎపిసోడ్ లో మిల్లర్ ఫ్యామిలీ నటీనటులు అంతా బ్యూటిఫుల్ ఎమోషన్స్ తో మంచి నటన కనబరిచారు. ఇందులో స్టీఫెన్, క్రిస్టీన్ లు అయితే సాలిడ్ ఎమోషనల్ పెర్ఫామెన్స్ లని చేయడమే కాకుండా తమ నడుమ నడిచే సంభాషణలు ఆలోచించేలా చేస్తాయి.

మైనస్ పాయింట్స్:

ఈ సిరీస్ లో ఒకింత స్లోగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. ఇండియన్ ఆడియెన్స్ వరకు సంభాషణలు పెద్దగా క్లిక్ కాకపోవచ్చు. కొన్ని కొన్ని సీన్స్ లో అంతసేపు మాటలు ఒకింత బోర్ గా అనిపిస్తాయి. అలాగే సిరీస్ చూస్తున్నంతసేపు ఒక ఇంట్రెస్టింగ్ ఎండింగ్ ని చాలా మంది ఆశించి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఒక ఎమోషనల్ ఎండింగ్ కనిపిస్తుంది. దీనితో ఆ మర్డర్ మిస్టరీ విషయంలో ఇంకొంచెం డీటైలింగ్ ని ఆశించినవారు డిజప్పాయింట్ కావచ్చు.

అలాగే కొన్ని చోట్ల మెదిలే ఒకటీ రెండు ప్రశ్నలు ఆడియెన్స్ కి ప్రశ్నలుగానే మిగిలిపోతాయి. మెయిన్ గా చివరి ఎపిసోడ్ లో జేమీ తండ్రి పెయింట్ కొనడానికి ఓ షాప్ కి వెళితే అక్కడ ఓ కుర్రాడు ఆ హత్య చేసింది జెమీ కాకపోవచ్చు ఆమె బాడీపై అనాటమీ చేయించండి, మంచి లాయర్ ని పెట్టుకోండి అన్నట్టు చెబుతాడు. అక్కడ నుంచి ఒక సీరియస్ టర్న్ తీసుకుంటుంది అనుకుంటే జస్ట్ ఎమోషనల్ గా ముగించడం అనేది అందరికీ రుచించకపోవచ్చు.

సాంకేతిక వర్గం:

ఈ సిరీస్ మాత్రం టెక్నికల్ గా ఒక బ్రిలియంట్ వర్క్ అని చెప్పాలి. మెయిన్ గా ప్రతీ ఎపిసోడ్ కూడా సింగిల్ టేక్ లో చేయడం అనేది మామూలు విషయం కాదు ఖచ్చితంగా సిరీస్ టెక్నికల్ టీం అందరి సమిష్టి కృషిని మెచ్చుకొని తీరాలి. ఇంకా కెమెరా వర్క్, మ్యూజిక్ అన్నీ బాగున్నాయి. ఎడిటింగ్ ఒక్కటి కొంచెం ఫాస్ట్ గా ఉండాల్సింది. ఇక వీటితో పాటుగా నెట్ ఫ్లిక్స్ తెలుగు డబ్బింగ్ వర్క్ ప్రతీ పాత్రకి పర్ఫెక్ట్ గా ఉంది.

ఈ సిరీస్ క్రియేటర్స్ లో మెయిన్ లీడ్ నటుడు స్టీఫెన్ గ్రాహమ్ కూడా ఒకరు కావడం విశేషం. అలాగే ఈ సిరీస్ ని ఫిలిప్ బారాన్టిన్ దర్సకత్వం వహించారు. తన దర్శకత్వం ఈ సిరీస్ కి బ్రిలియెంట్ గా ఉందని చెప్పవచ్చు. ప్రతీ ఎపిసోడ్ ని నిర్విరామంగా తెరకెక్కించిన విధానం అందులోని మాటలు, ఎమోషన్స్ ని తీసుకెళ్లిన పద్దతి, నటీనటుల్ని పర్ఫెక్ట్ గా సీన్ టు సీన్ ని మ్యానేజ్ చేసిన విధానం అద్భుతంగా అనిపిస్తుంది. ఈ క్రమంలో చిన్న చిన్న పొరపథ్యాలు సహజం వాటిని పక్కన పెట్టేస్తే తన వర్క్ ఈ సిరీస్ కి ఇంప్రెస్ చేస్తుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ సిరీస్ ‘అడొలెసెన్స్’ అటు టెక్నికల్ గా ఇటు కంటెంట్ పరంగా కూడా ఆడియెన్స్ ని ఎంగేజ్ చేస్తుంది. టెక్నికల్ గా నాలుగు ఎపిసోడ్స్ ని మేకర్స్ బ్రిలియంట్ గా తెరకెక్కిస్తే ఇందులో నటీనటుల పెర్ఫామెన్స్ లు వాటిని మించిన ఇంట్రెస్టింగ్ కథనం అనేవి మంచి ఎమోషన్స్ తో సాగడం అనేది మరో మంచి విషయం అని చెప్పవచ్చు. అలాగే ఈ సిరీస్ లో మెసేజ్ కూడా ఆడియెన్స్ ని ఆలోచింపజేసేలా చేస్తుంది. సో వీటితో ఈ నాలుగు ఎపిసోడ్స్ సిరీస్ ని తెలుగులో నెట్ ఫ్లిక్స్ లో ఇండియన్ ఆడియెన్స్ కి డెఫినెట్ గా ట్రై చేయవచ్చు. అలాగే వెస్ట్రన్ ఆడియెన్స్ కి అక్కడ కల్చర్ తెలిసినవారికి మరింత కనెక్ట్ అవుతుంది.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు