బోయపాటి తర్వాత మరో సెన్సేషనల్ కాంబోలో బాలయ్య..?

Published on Jul 3, 2020 3:00 am IST


ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ తన వరుస విజయ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తన హ్యాట్రిక్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మొన్న బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ రోర్ ఈ చిత్రంపై ఎనలేని భారీ హైప్ ను తెచ్చిపెట్టింది.

అయితే ఇప్పుడంటే బాలయ్యకు సిసలైన మాస్ ఫీస్ట్ తో బ్లాక్ బస్టర్ హిట్ లను బోయపాటి శ్రీను అందిస్తున్నారు కానీ రెండు దశాబ్దాల కాలం క్రితమే బాలయ్యతో ఒకదాన్ని మించి భారీ హిట్లను అందించిన ట్రెండ్ సెట్టింగ్ దర్శకుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది దర్శకుడు బి గోపాల్ అని చెప్పాలి. వీరిద్దరి కాంబో అంటే మోస్ట్ పవర్ ఫుల్ కాంబో అని చెప్పాలి.

అప్పట్లో “నరసింహా నాయుడు”, “సమర సింహా రెడ్డి” లాంటి ఎన్నో రికార్డు బ్రేకింగ్ సినిమాలు అందించిన ఈ కాంబో నుంచి మళ్లీ ఇన్నేళ్ల గ్యాప్ అనంతరం ఓ చిత్రం తెరకెక్కనుంది అని బజ్ వినిపిస్తుంది. ప్రస్తుతం బోయపాటి తో తెరకెక్కిస్తున్న చిత్రం తర్వాత ఈ భారీ ప్రాజెక్ట్ మొదలు కానుంది అని తెలుస్తుంది. ఒకవేళ ఇదే కాంబో మళ్లీ సెట్ అయితే ఆ ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More