బిగ్ బాస్ 4 – ఎమోషనల్ ఎపిసోడ్ తో ఫైనల్స్ కు అఖిల్.!

Published on Dec 5, 2020 8:00 am IST


ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్స్ స్టేజ్ కు వచ్చేస్తున్న ఈ షోలో ఎవరు విన్నవుతారు అన్నది ఆసక్తిగా మారింది. అయితే గత ఈ వారం ఎపిసోడ్స్ స్టార్టింగ్ లో నామినేషన్స్ తర్వాత ఫైనల్స్ టికెట్ కోసం బిగ్ బాస్ ఓ ఉయ్యాల టాస్క్ ఒకటి ఇచ్చారు. అయితే ఈ టాస్క్ కు గాను అఖిల్ అలాగే షోయెల్ లు ఇద్దరు గట్టిగానే కష్టపడ్డారు. కానీ ఇదే టాస్క్ వీరిద్దరి ఫ్రెండ్షిప్ ఎంత గట్టిగా ఉందో ప్రూవ్ చేసింది.

ఇక ఈ టాస్క్ అయ్యిపోతుంది అన్న సమయానికి ఎవరో ఒకరే ఉండాలి అన్న సమయంలో అనుకోకుండా షోయెల్ కిందకు దిగేసి అఖిల్ ను ఫైనల్స్ కు పంపించాడు. దీనితో ఒక్కసారిగా ఈ ఇద్దరు ఎంతో ఎమోషనల్ అయ్యిపోయి ఏడ్చేశారు. అలా ఫైనల్ గా షోయెల్ త్యాగం వల్ల అఖిల్ ఫైనల్స్ టికెట్ తో బిగ్ బాస్ హౌస్ లో మొట్ట మొదటి కంటెస్టెంట్ గా వెళ్ళాడు. మరి ఇక నుంచి ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More