“హను మాన్” తర్వాత “కల్కి” కూడా ఈ తరహా సినిమా

“హను మాన్” తర్వాత “కల్కి” కూడా ఈ తరహా సినిమా

Published on Jun 25, 2024 9:09 AM IST

ప్రస్తుతం టాలీవుడ్ ఆడియెన్స్ సహా మొత్తం పాన్ ఇండియా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ఏదన్నా ఉంది అంటే అదే రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం “కల్కి 2898 ఎడి” అనే చెప్పాలి. అయితే ఈ చిత్రం ఒక సై ఫై ఇంకా మైథలాజి బ్యాక్ డ్రాప్ సినిమా అని అందరికీ తెలిసిందే.

మరి రీసెంట్ గా అయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ బయటకి వచ్చాయి. మన తెలుగు సినిమా నుంచి వచ్చిన మొట్టమొదటి సూపర్ హీరో సినిమా ఏదన్నా ఉంది అంటే అది యంగ్ హీరో తేజ సజ్జ (Teja Sajja),ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబినేషన్ లో తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “హను మాన్” అనే చెప్పాలి. ఇందులో తేజ సూపర్ హీరోగా కనిపించాడు.

అయితే ఈ సినిమా తర్వాత మన టాలీవుడ్ నుంచి నెక్స్ట్ సూపర్ హీరోగా ప్రభాస్ కల్కి లో కనిపించబోతున్నాడు. ఇది స్వయంగా ప్రభాస్ చెప్పిన మాటే. ఈ సినిమాలో తన రోల్ ఒక సూపర్ హీరో అని మంచి హ్యూమర్, గ్రే షేడ్ లో నా రోల్ కల్కి లో కనిపిస్తుంది అని ప్రభాస్ రీసెంట్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. దీనితో మన టాలీవుడ్ నుంచి రెండో సూపర్ హీరో జానర్ సినిమా వచ్చేసినట్టే అని చెప్పి తీరాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు