“గేమ్ ఛేంజర్” సాంగ్స్ విజువల్స్ పై మరిన్ని అంచనాలు.!

“గేమ్ ఛేంజర్” సాంగ్స్ విజువల్స్ పై మరిన్ని అంచనాలు.!

Published on Jul 2, 2024 12:56 PM IST


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు మావెరిక్ దర్శకుడు శంకర్ తో అవైటెడ్ “గేమ్ ఛేంజర్” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు చివరి దశకి వచ్చింది కానీ శంకర్ ఇప్పుడు కమల్ తో చేసిన భారీ చిత్రం “భారతీయుడు 2” ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

అయితే ఈ చిత్రం కూడా శంకర్ మార్క్ లెవెల్లో గ్రాండ్ సాంగ్స్ తో కనిపిస్తుండగా నిన్న వచ్చిన క్యాలెండర్ సాంగ్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. మెయిన్ గా ఇందులో విజువల్స్ చూసి అంతా స్టన్ అవుతున్నారు. ఇలా వీటితో అయితే గేమ్ ఛేంజర్ సాంగ్స్ పట్ల అభిమానులు మరిన్ని అంచనాలు పెట్టుకుంటున్నారు.

ఇప్పటికే జరగండి సాంగ్ కి మంచి రెస్పాన్స్ రాగా మిగతా సాంగ్స్ విషయంలో కూడా ఖచ్చితంగా శంకర్ తన మాయాజాలంతో గ్రాండ్ ట్రీట్ ఇస్తారని వెయిట్ చేస్తున్నారు. మరి గేమ్ ఛేంజర్ సాంగ్స్ కి కూడా భారీ మొత్తంలోనే ఖర్చు పెట్టినట్టుగా దిల్ రాజు తెలిపారు. మరి విజువల్ గా ఇవి ఎలాంటి ఫీస్ట్ ని అందిస్తాయో వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు