“కల్కి”.. ఇంకా ఈ ట్రాన్స్ లోనే ఆడియెన్స్ అంతా

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం ఎన్నో అంచనాలు నడుమ రిలీజ్ కి రాగా వీటిని అందుకొని సాలిడ్ టాక్ ని అందుకుంది. అయితే ఈ సినిమా విడుదల అయ్యిన తర్వాత నుంచి ఆడియెన్స్ అంతా ఒకే ట్రాన్స్ లో ఉన్నారని చెప్పాలి. సినిమాలో గతం అలాగే భవిష్యత్తు కూడా చూపించారు.

కానీ ఆడియెన్స్ మాత్రం ఒక్క గతంలో జరిగిన మహాభారతం సీక్వెన్స్ కోసమే ఓ రేంజ్ లో మాట్లాడుకుంటున్నారు. నాగ్ అశ్విన్ చూపిన విజన్, తన ఆలోచనా విధానం కి ముగ్దదులైపోయారు. కర్ణుడు, కృష్ణుడు, అర్జునుడు పురాణాలు సంబంధించిన పలు ఆసక్తికరమైన వీడియోలు షేర్ చేసుకుంటున్నారు. ఇలా ఈ సినిమా విడుదల అయ్యాక అంతా ఈ ట్రాన్స్ లోకి వెళ్లిపోయారు అని చెప్పాలి.

Exit mobile version