పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ డ్రామా “ఓజి” (They Call Him OG) పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలిసిందే. అయితే ఈ ఏడాదిలో ఆల్రెడీ రిలీజ్ డేట్ ని ఈ చిత్రం లాక్ చేసుకోగా ఈ సినిమా ఓటిటి డీల్ లాక్ కానుందున సినిమా ఆలస్యం అవ్వవచ్చని కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి.
మరి ఇప్పుడు ఈ సినిమా ఓటిటి డీల్ ఎట్టకేలకి ఫినిష్ అయ్యినట్టుగా స్ట్రాంగ్ బజ్ ఇప్పుడు వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ సినిమాకి ఏకంగా రికార్డు ధర 90 కోట్లకి పైగా వెచ్చించి దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టుగా వినిపిస్తుంది. ఇది మాత్రం మన టాలీవుడ్ సహా ఇండియన్ సినిమా దగ్గర కూడా హైయెస్ట్ ధరల్లో ఒకటి అని చెప్పాలి.
మొత్తానికి కొంచెం ఆలస్యం అయ్యినా కూడా ఈ సినిమాకి సాలిడ్ నెంబర్ దక్కింది అని చెప్పాలి. ఇక స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ సంబంధించి అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.