‘సికందర్’ ప్లాప్.. కొత్త మోటివేషన్ తో ‘కండల వీరుడు’

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నుంచి ఒక్క సాలిడ్ హిట్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఇండియన్ సినిమా దగ్గర ఇపుడు 1000 కోట్ల సినిమాలు కొనసాగుతున్నాయి కానీ ఈ మార్కెట్ లేని సమయంలోనే సల్మాన్ 900 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టాడు. మరి అలాంటి సల్మాన్ ఇపుడు ఓ భారీ హిట్ కోసం ఎదురు చూస్తుండడం తన ఫ్యాన్స్ కి కూడా ఒకింత బాధగానే ఉంది.

అయితే తాను నటించిన లేటెస్ట్ చిత్రం “సికందర్” కూడా భారీ ప్లాప్ అయ్యింది. మరి ఈ ప్లాప్ తర్వాత కూడా సల్మాన్ వెనక్కి తగ్గడం లేదు. తన జిమ్ నుంచి లేటెస్ట్ గా పోస్ట్ చేసిన పిక్స్ ఇపుడు వైరల్ గా మారాయి. తన ట్యాగ్ కండల వీరుడు అనే మాటని సార్ధకం చేసేలానే తన బాడీ చూపిస్తూ సల్మాన్ ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచాడు. మీ మోటివేషన్ కి ధన్యవాదాలు అంటూ కూడా తను పోస్ట్ చేయడం విశేషం. దీనితో ఈ పిక్స్ ఇపుడు వైరల్ గా మారాయి.

Exit mobile version