గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన సాలిడ్ పొలిటికల్ కమర్షియల్ డ్రామా “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం నుంచి లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ మరిన్ని అంచనాలు పెంచేసింది.
అయితే ఇన్ని రోజులు ఉన్న అనుమానాలకు తెర దించుతూ ట్రైలర్ కట్ సూపర్ హిట్ కావడంతో ఇక నెక్స్ట్ బిగ్ థింగ్ పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయని చెప్పాలి. మరి ఆ పెద్ద విషయమే సినిమా ప్రీరిలీజ్. ఏపీలో భారీ లెవెల్లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మేకర్స్ చేస్తున్నారు.
పైగా పవర్ స్టార్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ముఖ్య అతిధిగా వస్తుండడంతో మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. వీరితో పాటుగా మరింత మంది బిగ్ స్టార్స్ సహా శంకర్ లాంటి దిగ్గజాలతో కలిపి స్టేజ్ డెఫినెట్ గా ఫ్యాన్స్ కి భారీ హై ని అందిస్తుంది.
ఇలా గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ పై కూడా ప్రస్తుతం గట్టి అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ ఈవెంట్ కూడా సజావుగా జరిగితే తెలుగు రాష్ట్రాల్లో గేమ్ ఛేంజర్ ఓపెనింగ్స్ ని ఆకాశమే హద్దు అని చెప్పవచ్చు. ఇక ఈ అవైటెడ్ సినిమా ఈ జనవరి 10న గ్రాండ్ గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కి రాబోతుంది.