మంచు విష్ణు ప్రస్తుతం జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమాలో నటించాడు. ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో హీరోయిన్. బ్రహ్మానందం ఈ సినిమాలో చేసిన పాత్రకు థియేటర్స్ లో ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుందని చిత్ర యూనిట్ తెలిపిన సంగతి తెలిసిందే. ఫుల్ లెంగ్త్ కామెడి ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకురాబోతున్న ఈ సినిమా విడుదల తేదిని త్వరలో ప్రకటించనున్నారు చిత్ర యూనిట్.
ఈ సినిమా తరువాత మంచు విష్ణు పరశురాం బుజ్జి దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఇప్పటికే వీరి మద్య కథా చర్చలు జరిగాయని సమాచారం. ప్రస్తుతం పరశురాం విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేస్తున్నాడు. గీత ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా పూర్తయ్యాక పరశురాం బుజ్జి, మంచు విష్ణు సినిమా ప్రారంభం కానుంది.