మళ్ళీ చప్పుడు చేయని “గేమ్ ఛేంజర్”.!

మళ్ళీ చప్పుడు చేయని “గేమ్ ఛేంజర్”.!

Published on Sep 14, 2024 7:00 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మెగా అభిమానులు ఎప్పుడు నుంచో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు కానీ సరైన అప్డేట్స్ అయితే ఈ చిత్రం నుంచి రావడం లేదని వారు బాధ పడుతున్నారు. ఇలా ఇటీవల ఎంతో కాలం విరామం తర్వాత ఎట్టకేలకి సెకండ్ సింగిల్ అంటూ అప్డేట్ ఇచ్చారు.

ఈ సెప్టెంబర్ లోనే రిలీజ్ అంటూ అనౌన్స్ కూడా చేశారు. కానీ అనౌన్స్ చేసిన తర్వాత నుంచి మళ్ళీ మేకర్స్ మౌనం వ్యక్తం చేస్తున్నారు. దీనితో మళ్ళీ ఫ్యాన్స్ లో రచ్చ స్టార్ట్ అయ్యింది. సెప్టెంబర్ అన్నారు. ఆల్రెడీ సగం అయ్యిపోతుంది. ఇంకా మళ్ళీ ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదని సోషల్ మీడియాలో అనుకుంటున్నారు. ఇపుడు ఎలాగో సగం అయ్యినా ఇంకా నెలలో మరో సగం రోజులు ఉన్నాయి కదా సో ఈ మిగతా రోజుల్లో ఎప్పుడు వస్తుంది అనే డేట్ అయినా త్వరగా అనౌన్స్ చేసి అభిమానులు కోరుకునే ట్రీట్ ఇస్తారో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు