“మత్తు వదలరా 2” లో అతడిపై స్పెషల్ అప్లాజ్

“మత్తు వదలరా 2” లో అతడిపై స్పెషల్ అప్లాజ్

Published on Sep 13, 2024 10:06 PM IST

లేటెస్ట్ గా మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం “మత్తు వదలరా 2” కూడా ఒకటి. శ్రీ సింహా హీరోగా దర్శకుడు రితేష్ రానా తెరకెక్కించిన ఈ క్రేజీ ఎంటర్టైనర్ ఆడియెన్స్ నుంచి డీసెంట్ టాక్ అండ్ రివ్యూస్ తెచ్చుకుంది. అయితే ఈ చిత్రం కోసం ఇపుడు మాట్లాడుకునే ప్రతి ఒక్కరూ ఒక నటుడు కోసం తప్పకండా మాట్లాడకుండా ఉండట్లేదు. మరి అతడే కమెడియన్ సత్య.

గత చిత్రంలోనే అదరగొట్టిన సత్య ఈసారి సీక్వెల్ లో అంతకు మించిన డోస్ ని ఇచ్చాడు అని చెప్పాలి. సినిమాలో కామెడీ పరంగా బిగ్గెస్ట్ ఎసెట్ గా నిలిచాడు. దీనితో ఇపుడు సత్య ప్రస్తావన లేకుండా మత్తు వదలరా 2 టాపిక్ మాత్రం రావడం లేదు. ఈ రేంజ్ లో సత్య మంచి మార్క్ ని ఈ సినిమాలో వేసుకున్నాడని చెప్పాలి. దీనితో తనకి అందరి నుంచి కూడా స్పెషల్ అప్లాజ్ దక్కుతుంది. ఇక ఈ చిత్రంలో ఫారియా అబ్దుల్లా, సునీల్, వెన్నెల కిషోర్ తదితరులు నటించగా కాల భైరవ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు