అఖిల్ “ఏజెంట్” టీవీ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్!

టాలీవుడ్ హీరో, అఖిల్ అక్కినేని చివరిసారిగా ఏజెంట్ చిత్రంలో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కాకముందే, టెలివిజన్ ప్రీమియర్ కి రెడీ అయిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. హిందీలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సంబందించిన డేట్ ను ఫిక్స్ చేసుకుంది.

ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను గోల్డ్‌మైన్స్ ఛానెల్ సొంతం చేసుకుంది. ఏజెంట్ తన ఛానెల్‌లో జూలై 28, 2024 న రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుందని వెల్లడించింది. నార్త్ ఆడియెన్స్ ఈ చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారోనని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించగా, సాక్షి వైద్య కథానాయికగా నటించింది. డినో మోరియా విలన్‌గా నటించారు. వక్కంతం వంశీ రచించి, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.

Exit mobile version