విడుదల తేదీ : ఫిబ్రవరి 28, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : జీవా, అర్జున్ సార్జా, రాశీ ఖన్నా, రోహిణి, ఎడ్వర్డ్ సోనెన్ బ్లిక్, యోగిబాబు, రెడిన్ కింగ్స్లే, తదితరులు
దర్శకుడు : పా. విజయ్
నిర్మాతలు : ఇషారి కే గణేష్, అనీష్ అర్జున్ దేవ్
సంగీతం : యువన్ శంకర్ రాజా
ఛాయాగ్రహణం : దీపక్ కుమార్
కూర్పు : సాన్ లోకేష్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఈ వారం థియేటర్స్ లోకి రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో యాక్షన్ కింగ్ అర్జున్ సార్జా అలాగే జీవా కలయికలో వచ్చిన హారర్ ఫాంటసీ చిత్రం “అగత్యా” కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
18వ దశకానికి చెందిన ఎడ్విన్ డుప్లెక్స్ లో ఆర్ట్ డైరెక్టర్ అయినటువంటి జీవా(అగత్యా) తన ఫ్రెండ్స్ వీణా(రాశిఖన్నా) ఇతరులతో కలిసి దాన్నొక స్కేరీ హౌస్ గా మార్చి డబ్బులు చేసుకుంటారు. కానీ ఆ బంగ్లాలో కొన్ని అతీంద్రియ శక్తులు ఉన్నాయని తెలుసుకుంటారు. అయితే ఈ బంగ్లాలో అసలు ఏమయ్యింది? సిద్ధ వైద్యంలో సిద్ధహస్తులు అయినటువంటి సిద్ధార్థ్ (అర్జున్ సార్జా) అలాగే ఎడ్విన్ (ఎడ్వర్డ్ సోనెన్ బ్లిక్) కి ఉన్న సంబంధం ఏంటి? సిద్ధార్థ్, సిద్ధ వైద్యంలో కనుకున్న విప్లవాత్మక మందు ఏంటి? అది చివరికి ఏమయ్యింది? ఈ అంతటికీ 85 ఏళ్ళుకి ఒకసారి వచ్చే గ్రహమాలకి లింక్ ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
ఈ చిత్రంలో మేకర్స్ టచ్ చేసిన పాయింట్ మన దేశ చరిత్రకి సంబంధించి వైద్యం పరంగాక చూపించిన కొన్ని ఎలిమెంట్స్ డీసెంట్ గా అనిపిస్తాయి. ఇందులో మంచి ఎమోషన్స్ సహా హారర్, కామెడీ ఎలిమెంట్స్ ని జోడించారు. మెయిన్ గా ఫస్టాఫ్ లో యోగిబాబు పై కొన్ని కామెడీ సీన్స్ వర్కౌట్ అవుతాయి.
ఇక వీటితో పాటుగా సినిమాలో అక్కడక్కడా కొన్ని హారర్ ఎలిమెంట్స్ ఓకే అనిపిస్తాయి. సీనియర్ నటుడు అర్జున్ సార్జాపై ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగుంది. అలాగే తన రోల్ లో కూడా అర్జున్ బాగా సెట్ అయ్యారు. ఇక యంగ్ హీరో జీవా కూడా తన రోల్ లో బాగున్నాడు. పలు ఎమోషన్స్, యాక్షన్ ని బాగానే చేసాడు. ఇంకా రాశీ ఖన్నా డీసెంట్ లుక్స్ తో కనిపించింది.
వీరితో పాటుగా రెడిన్ కింగ్స్లే, ఎడ్వర్డ్ తదితరులు తమ పాత్రల్లో బాగానే చేశారు. ఇంకా నటి రోహిణి ఈ సినిమా కోసం ఛాలెంజింగ్ మేకోవర్ ట్రై చేయడం హర్షణీయం. తన పాత్రలో ఆమె జీవించారు. ఇక వీటితో పాటుగా సినిమాలో కొన్ని దేశభక్తి అంశాలు ఆడియెన్స్ కి కనెక్ట్ కావచ్చు.
మైనస్ పాయింట్స్:
ఈ చిత్రంలో లైన్ చాలా రొటీన్ గా అనిపిస్తుంది అని చెప్పవచ్చు. ఈ తరహా కథ, కథనాల్లో ఇది వరకే చాలా సినిమాలు చూసేసాం సో ఈ చిత్రంలో అంత ఎగ్జైటింగ్ పార్ట్ పెద్దగా కనిపించదు. సిద్ధ వైద్యం కోసం, చూపించిన కొన్ని సీన్స్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి తప్ప మిగతా సినిమా అంతా ఏదో అలా వెళుతున్నట్టుగా అనిపిస్తుంది.
ఇంకా వీటితో పాటుగా పలు సాంగ్స్ కూడా అనవసరం అని చెప్పాలి. అర్జున్ పై ఫస్టాఫ్ లో డీసెంట్ గానే సన్నివేశాలు హ్యాండిల్ చేశారు కానీ సెకండాఫ్ లో ఆ లవ్ ట్రాక్స్ ల;లాంటివి తగ్గించాల్సింది. ఇవి కట్ చేసి ఉంటే కథనం ఇంకొంచెం ఫాస్ట్ గా అనిపించి ఉండొచ్చు. సినిమాలో మెయిన్ పాయింట్ మరీ అంత కన్విన్స్ చేసే రకంగా కూడా అనిపించదు.
సో వీటితో సినిమా అలా ఫ్లాట్ గానే కొనసాగుతున్న భావన కనిపిస్తుంది. ఇంకా ఈ చిత్రానికి హారర్ ఎలిమెంట్స్ ఏమంత భయం కూడా తెప్పించవు. ఒక మూమెంట్ కి వచ్చేసరికి ఇవన్నీ అనవసరం ఏమో అనిపిస్తాయి. అలాగే క్లైమాక్స్ లో మొత్తం యానిమేషన్ తో చేసిన యాక్షన్ బ్లాక్ ఫోర్స్డ్ గా అనిపిస్తుంది. పలు హాలీవుడ్ సినిమాలు కూడా గుర్తు రాక మానవు.
సాంకేతిక వర్గం:
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి. నేపథ్యానికి తగ్గట్టుగా చేసిన సెటప్, పీరియాడిక్ కట్టడాలు బాగున్నాయి. అలాగే ఫాంటసీ ఎలిమెంట్స్ లో గ్రాఫిక్స్ కూడా పర్వాలేదు అని చెప్పవచ్చు. ఇక యువన్ శంకర్ రాజా సాంగ్ యావరేజ్ గా ఉన్నాయి, నేపథ్య సంగీతం అక్కడక్కడా బాగుంది. సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా చేయాల్సింది. తెలుగు డబ్బింగ్ పర్వాలేదు.
ఇక దర్శకుడు పా విజయ్ విషయానికి వస్తే.. తాను సిద్ధ వైద్యానికి సంబంధించి డీసెంట్ లైన్ తీసుకున్నారు కానీ దానిని హారర్, ఫాంటసీ ఎలిమెంట్స్ తో ఇంకా బెటర్ వెర్షన్ లో ట్రై చేయాల్సింది. హారర్ ఎలిమెంట్స్ పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ తాను డిజైన్ చేసిన ఎమోషనల్ మూమెంట్స్, పేట్రియాట్ మూమెంట్స్ సినిమాలో డీసెంట్ గా అనిపిస్తాయి.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ “అగత్యా” లో మెయిన్ లీడ్ నటీనటులు మంచి పెర్ఫామెన్స్ లని అందించారు. అలాగే సినిమాలో కొన్ని ఎమోషన్స్, మన చరిత్రకి సంబంధించిన అంశాలు పర్వాలేదనిపిస్తాయి. కానీ ఈ మూమెంటం సినిమా ఆధ్యంతం లేదు. ట్రీట్మెంట్ చాలా రొటీన్ గానే ఉంది. మరీ ఎగ్జైట్ చేసే ఎలిమెంట్స్ ఈ హారర్, ఫాంటసీ సినిమాలో లేవు. కేవలం కొన్ని సీన్స్ వరకు అయితే ఈ చిత్రం ఓకే అనిపిస్తుంది.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team