బాలయ్య మూవీలో అఘోరా ఎపిసోడ్ హైలెట్ అట

Published on Jul 15, 2020 3:05 am IST


బాలయ్య ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న కాంబినేషన్ ఆరేళ్లకు కార్యరూపం దాల్చింది. బాలయ్య-బోయపాటి శ్రీను మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చివరి చిత్రం లెజెండ్ 2014లో విడుదల అయ్యింది. ఇక బాలయ్య సైతం వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతుండగా బోయపాటి మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నారు.

ఈ మూవీలోని బాలయ్య ఫస్ట్ లుక్ విడుదల కాగా విశేష స్పందన దక్కించుకుంది. కాగా ఈ మూవీలో బాలయ్య ఓ పాత్రలో అఘోరాగా కనిపిస్తారన్న సంగతి తెలిసిందే. దాదాపు అరంగంట వరకు కొనసాగే అఘోర ఎపిసోడ్ సినిమాకే హైలెట్ అన్నమాట వినిపిస్తుంది. ఆ పాత్ర నేపథ్యం కూడా చాల ఆసక్తికరంగా బోయపాటి రాసుకున్నారట. మిర్యాల రవీంద్రా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More