అన్‌స్టాపబుల్2: నెక్స్ట్ ఎపిసోడ్ గెస్ట్ లను అనౌన్స్ చేసిన ఆహా!


అత్యంత ప్రజాదరణ పొందిన ఓటిటి టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ NBK సీజన్ 2 దూసుకు పోతుంది. ఇప్పటివరకు రాజకీయ నాయకులతో సహా చాలా మంది ప్రముఖులు ఈ షో కి అతిథులు గా విచ్చేశారు. ఇప్పుడు ఆహా వీక్షకుల కోసం ఓ స్పెషల్ సర్ ప్రైజ్ ఎపిసోడ్ ను ప్లాన్ చేసింది. మేము ముందుగా ప్రకటించినట్లుగా, రాబోయే ఎపిసోడ్‌లో వీరసింహా రెడ్డి టీమ్ కనిపించనుంది.

డైరెక్టర్ గోపీచంద్ మలినేని, శృతి హాసన్, వరలక్ష్మి శరత్‌కుమార్, హనీ రోజ్, నవీన్ యెర్నేని, రవిశంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన ఎపిసోడ్ నుండి ఆహా వీడియో కొన్ని చిత్రాలను షేర్ చేస్తూ ఈ ఎపిసోడ్ ను ప్రకటించడం జరిగింది. ఎపిసోడ్‌కి సంబంధించిన ఫన్ ప్రోమో త్వరలో విడుదల కానుంది. ఈ స్పెషల్ ఎపిసోడ్ సంక్రాంతి స్పెషల్ కానుకగా జనవరి 13, 2023న ఆహాలో ప్రదర్శించబడుతుంది.

Exit mobile version