ఓటిటి సమీక్ష: ‘హోమ్ టౌన్’ – తెలుగు సిరీస్ ఆహా లో ప్రసారం

ఓటిటి సమీక్ష: ‘హోమ్ టౌన్’ – తెలుగు సిరీస్ ఆహా లో ప్రసారం

Published on Apr 4, 2025 1:05 PM IST

Home town Movie Review In Telugu

విడుదల తేదీ : ఏప్రిల్ 4, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాదమ, ఆనీ, సాయి రామ్, అనిరుద్ భాస్కర్ తదితరులు
దర్శకత్వం : శ్రీకాంత్ రెడ్డి.పల్లె
నిర్మాణం : రాజశేఖర్ మేడారం
సంగీతం : సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ : దేవ్ దీప్ గాంధీ కుందు
ఎడిటర్ : కార్తిక్ కట్స్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

మన తెలుగు ఓటిటి యాప్ ‘ఆహా’లో లేటెస్ట్ గా రిలీజ్ కి వచ్చిన వెబ్ సిరీస్ “హోమ్ టౌన్”. రాజీవ్ కనకాల అలాగే ఝాన్సీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ని 90స్ బయోపిక్ మేకర్స్ తెరకెక్కించడం జరిగింది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ఈ సిరీస్ 2003 సమయం నుంచి తెలంగాణ హన్మంతుల గూడెం అనే చిన్న గ్రామంలో కనిపిస్తుంది. ఒక ఫోటో స్టూడియోతో తన మిడిల్ క్లాస్ లైఫ్ ని ప్రసాద్ (రాజీవ్ కనకాల) తన భార్య (ఝాన్సీ) అలాగే పిల్లలు శ్రీకాంత్ (ప్రజ్వల్ యద్మ) అలాగే తన చెల్లెలు జ్యోతి (ఆనీ) లని వచ్చే తక్కువపాటి మొత్తం తోనే లీడ్ చేస్తారు. అయితే శ్రీకాంత్ కి సరిగా చదువు ఎక్కదు కానీ కూతురు మాత్రం బాగా చదువుతుంది. అయితే వీరి అందరి నడుమ డ్రామా ఎలా సాగింది? ఎవరు ఏం చేశారు? ప్రసాద్ కోరుకున్నట్టుగా తన కొడుకు విదేశాలకి వెళ్తాడా లేదా? శ్రీకాంత్ ఏమవ్వాలి అనుకుంటాడు? తన చెల్లెలు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది ఈ సిరీస్ లో అసలు కథ.

ప్లస్ పాయింట్స్:

ఇటీవల 90స్ నేపథ్యంలో వచ్చిన పలు సినిమాలు, సిరీస్ తరహాలోనే దీనిలో కూడా కొన్ని మూమెంట్స్ 90స్ కిడ్స్ బాగా కనెక్ట్ అవుతాయి. అప్పటి కొన్ని కొన్ని సన్నివేశాలు అలాగే ఎమోషన్స్ ఈ సిరీస్ లో ఆకట్టుకుంటాయి అని చెప్పవచ్చు. మెయిన్ గా మొదటి మూడు ఎపిసోడ్స్ డీసెంట్ గా సాగాయి అని చెప్పవచ్చు. ఈ మూడింటిలో కూడా రెండో ఎపిసోడ్ మాత్రం మంచి హిలేరియస్ గా సాగుతుంది.

ప్రతీ ఎపిసోడ్ లో డీసెంట్ ఎమోషనల్ ఎండింగ్ ఓకే అనిపిస్తుంది. ఇక నటీనటుల్లో ముగ్గురు యువ నటులు ప్రజ్వల్, సాయి రామ్ అలాగే అనిరుద్ లు చాలా బాగా చేశారు. మెయిన్ గా వీరి ముగ్గురు మధ్య నడిచే కామెడీ సీన్స్ అన్నీ బాగున్నాయని చెప్పవచ్చు. ముగ్గురులో కూడా సాయి రామ్ పై కామెడీ భలే అనిపిస్తాయి. అంతే కాకుండా ఆ రోల్ ని యువ నటుడు బాగా రక్తి కట్టించాడు.

ఇక ప్రజ్వల్ నీట్ పెర్ఫామెన్స్ ని అందించాడు. పలు ఎమోషనల్ సీన్స్ ని బాగా చేసాడు. ఇక వీరితో పాటుగా సీనియర్ నటులు రాజీవ్ కనకాల, ఝాన్సీలు తమ అనుభవాన్ని తమ పాత్రల్లో చూపించారు. మధ్య తరగతి కుటుంబ తల్లిదండ్రుల్లా తమ పిల్లల కోసం వారి భవిష్యత్తు కోసం తాపత్రయం పడే ఇనోసెంట్ తల్లిదండ్రుల్లా చాలా బాగా చేశారు. అలానే యువ నటి ఆనీ తన పాత్రలో బాగా చేసింది. కొన్ని సన్నివేశాలు ఫ్లోలో వెళతాయి కానీ అందులో ఆమెపై ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. అలానే క్లైమాక్స్ లో చిన్న ఎమోషనల్ బిట్ తనపై బాగుంది.

మైనస్ పాయింట్స్:

ఈ సిరీస్ ని కూడా 90స్ కాంపౌండ్ వారే తీసుకురావడం ఓకే కానీ ఇది వరకు ఆ 90స్ బయోపిక్ సహా కమిటీ కుర్రోళ్ళు లాంటివి చూసిన వారికి ఒకింత రొటీన్ గానే అనిపిస్తుంది. అలాగే ఈ సిరీస్ లో కేవలం 5 ఎపిసోడ్స్ మాత్రమే అందులోని నిడివి కూడా తక్కువగానే ప్లాన్ చేసినప్పటికీ అన్ని ఎపిసోడ్స్ కూడా అంత ఎఫెక్టివ్ గా అనిపించవు.

మెయిన్ గా ఆ ముందు సిరీస్, సినిమాల ప్రభావమో ఏమో కానీ వాటి ఎఫెక్ట్ మాత్రం ఇందులో కనిపించడం బాగా రొటీన్ గా అనిపిస్తుంది. అలాగే లస్ట్ ఎపిసోడ్ కొంతమేర ఫ్యామిలీ ఆడియెన్స్ కి ఇబ్బందిగా ఉండొచ్చు. ఇక నాలుగో ఎపిసోడ్ ఫేస్ బుక్ ఎపిసోడ్ కేవలం ఆ ఎపిసోడ్ వరకు ఓకే కానీ అది మాత్రం బాగా ల్యాగ్ అనిపిస్తుంది.

దీనిని స్టార్టింగ్ లోనే సెటప్ చేసి ఉంటే బాగుండు లేదా చిన్నగా కుదించాల్సింది. ఇది అప్పటి వరకు ఉన్న ఫ్లోని దెబ్బ తీసినట్టు అనిపిస్తుంది. అలాగే సిరీస్ లో ఇద్దరు అన్నా చెల్లెల్లో లేదా అక్కా తమ్ముళ్ళో ఒకే క్లాస్ లో ఎలా చదువుతారు అనే లాజిక్ కూడా కరెక్ట్ గా అనిపించదు. అలాగే క్లైమాక్స్ పోర్షన్ లో రాజీవ్ కనకాల ప్రజ్వల్ నడుమ ఎమోషనల్ సంభాషణలు కొత్తగా ఏమన్నా ట్రై చేయాల్సింది.

సాంకేతిక వర్గం:

ఈ సిరీస్ లో నిర్మాణ విలువలు బాగున్నాయి. మెయిన్ గా 2003 సమయం నుంచి అట్మాస్పియర్ ని బాగా రీక్రియేట్ చేశారు. ఈ పరంగా నిర్మాణ విలువలు సెటప్ అంతా బాగుంది. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ ఓకే. దేవ్ దీప్ గాంధీ కుందు సినిమాటోగ్రఫి బాగుంది. పాత రోజులు గుర్తు చేసేలా మంచి విజువల్స్ ని కెమెరాతో బంధించారు. అలాగే కార్తీక్ ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్ గా ట్రై చేసి ఉంటే బాగుండేది.

ఇక దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి పల్లె విషయానికి వస్తే.. తాను తన బయోపిక్ నే ఈ సిరీస్ లా తీసుకున్నారు కావచ్చు ఏమో కానీ చాలా వరకు ఓకే కానీ కొన్ని అంశాలు మాత్రం ఈ సిరీస్ లో కొంచెం డల్ గా సాగాయి. అలాగే కొన్ని సీన్స్ రొటీన్ గానే అనిపిస్తాయి. నటీనటుల నుంచి మంచి పెర్ఫామెన్స్ లని తాను రాబట్టుకున్నారు కానీ కథనం విషయంలో మాత్రం ఇంకా దృష్టి పెట్టాల్సింది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘హోమ్ టౌన్’ సిరీస్ నోస్టాలజీ అంశాలని ఇష్టపడేవారికి డీసెంట్ గా అనిపిస్తుంది. మెయిన్ గా హిలేరియస్ సీన్స్ ఈ సిరీస్ లో బాగా వర్కౌట్ అయ్యాయి అని చెప్పవచ్చు. నాలుగో ఎపిసోడ్ మినహా మిగతా అంతా పర్వాలేదు అనిపిస్తుంది. అయితే 90స్ బయోపిక్ షేడ్స్ ఎక్కువ కనిపిస్తాయి కానీ క్లైమాక్స్ కొంతమేర ఓకే అని చెప్పొచ్చు. వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ సిరీస్ ని ఆహా లో ట్రై చేస్తే మంచిది.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు