మన తెలుగు ఆడియెన్స్ కి అంటూ ఉన్న ఒక స్పెషల్ తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా కోసం అందరికీ తెలిసిందే. మరి ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో అలరిస్తూ వస్తున్న ఆహా నుంచి లేటెస్ట్ గా రెండు ఇంట్రెస్టింగ్ సినిమాలు వచ్చాయి. టాలీవుడ్ యువ నటుడు ప్రియదర్శి లీడ్ రోల్ లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి’.
నిరంజన అనూప్, మణికందన్ ఆర్. ఆచారి ఇతర కీలక పాత్రలు పోషించారు. నారాయణ చెన్నా దర్శకత్వం వహించారు. బ్యాంక్ రాబరీ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ మూవీలో ప్రియదర్శి క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులని కట్టిపడేసింది. తనదైన నేచురల్ పెర్ఫామెన్స్, కామిక్ టైమింగ్ తో కథని ఆద్యంతం ఆకట్టుకునేలా నడిపారు ప్రియదర్శి. ఇప్పుడీ సినిమా భవానీ మీడియా ద్వారా ఆహ ఓటీటీలో నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ కి వచ్చేసింది.
ఇక ఆ సినిమాతో పాటుగా మలయాళం స్టార్ టోవినో థామస్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం “నారదన్”. అన్నా బెన్, షరాఫుద్దీన్, ఇంద్రన్స్, జాఫర్ ఇడుక్కి ఇతర కీలక పాత్రలు పోషించారు. నిజ జీవిత సంఘటనల నుండి ప్రేరణ పొందిన ఈ చిత్రంలో న్యూస్ యాంకర్ చంద్రప్రకాష్ పాత్రలో టోవినో మెస్మరైజ్ చేశారు. మలయాళంలో విజయం సాధించిన ఈ చిత్రం తెలుగు వెర్షన్ భావనీ మీడియా ద్వారా ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. నవంబర్ 29 నుంచి ఆహాలో ప్రసారం కానుంది. మరి ఈ రెండు ఇంట్రెస్టింగ్ సినిమాలని ఎక్స్ క్లూజివ్ గా ఆహా లో చూడవచ్చు.