భారీ ఫైట్ తో స్టార్ట్ కానున్న ‘అహం బ్రహ్మాస్మి’ !

భారీ ఫైట్ తో స్టార్ట్ కానున్న ‘అహం బ్రహ్మాస్మి’ !

Published on Jun 1, 2020 9:45 PM IST


రాకింగ్ స్టార్ మంచు మనోజ్‌ ‘అహం బ్రహ్మాస్మి’తో మళ్ళీ సినిమాల్లో యాక్టివ్ కాయబోతున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ జులై నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలుకానుందని తెలుస్తోంది. ముందుగా ఫైట్ మాస్టర్ పీటర్ హేన్స్ కంపోజింగ్ లో భారీ ఫైట్ సీక్వెన్సెస్ సినిమాని స్టార్ట్ చేయనున్నారు. ఎప్పుడూ కొత్తదనం కోసం వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తాడు మనోజ్.

కాగా ఈ సారి కూడా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో.. ‘అహం బ్రహ్మాస్మి’ అనే గొప్ప స్లోగన్ ఆధారంగా నడిచే కథతో పవర్ ఫుల్ రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ఇండస్ట్రీలో కొత్త టాలెంట్‌ ను ఎంకరేజ్‌ చేయాలని ‘ఎమ్ఎమ్‌ ఆర్ట్స్‌’ పేరుతో మంచు మనోజ్ సొంత నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించారు. దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా ఎమ్ ఎమ్ ఆర్ట్స్ పతాకం పై మంచు ఫ్యామిలీ స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు