ఓటీటీ రివ్యూ: అహం రీబూట్ – ఆహాలో ప్రసారం

ఓటీటీ రివ్యూ: అహం రీబూట్ – ఆహాలో ప్రసారం

Published on Jul 2, 2024 12:05 AM IST
Aham Reboot Movie Review in Telugu

విడుదల తేదీ : జూలై 01, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: సుమంత్‌

దర్శకులు: ప్రశాంత్‌ సాగర్‌ అట్లూరి

నిర్మాతలు : రఘువీర్‌ గోరిపర్తి, సృజన్‌ యరబోలు

సంగీత దర్శకుడు: శ్రీరామ్‌ మద్దూరి

సినిమాటోగ్రఫీ: వరుణ్‌ అంకర్ల

సంబంధిత లింక్స్: ట్రైలర్

సుమంత్‌ హీరోగా సింగిల్ క్యారెక్ట‌ర్‌తో తెర‌కెక్కిన సినిమా అహం రీబూట్. నేరుగా ఆహా ఓటీటీలో రిలీజైంది. మరి ఈ ఫిల్మ్ మీకు నచ్చుతుందా ? లేదా ? అనేది మా సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

నిలయ్‌(సుమంత్‌) ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ కావాలని కలలు కంటాడు. అయితే, ఓ యాక్సిడెంట్‌ అతని జీవితాన్ని మార్చేస్తుంది. పైగా ఆ యాక్సిడెంట్ లో నిల‌య్ కార‌ణంగా అవంతిక అనే ఓ అమ్మాయి చ‌నిపోతుంది. దీంతో ఆ గిల్టీ ఫీలింగ్ కార‌ణంగా నిల‌య్ ఆత్మ‌హ‌త్య ఆలోచ‌న‌ల‌తో సఫర్ అవుతూ ఉంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో తన బాధ నుంచి దూరం అయ్యేందుకు నిలయ్ రేడియో జాకీ జాబ్‌లో జాయిన్ అవుతాడు. ఓ రోజు అత‌డి రేడియో స్టేష‌న్‌కు ఓ అమ్మాయి కాల్ చేసి… త‌న‌ను ఎవ‌రో కిడ్నాప్ చేసి చీక‌టి రూమ్‌లో బంధించార‌ని, సేవ్ చేయమని రిక్వెస్ట్ చేస్తోంది. అసలు ఆ అమ్మాయి ఎవరు ?, ఎందుకు నిలయ్ కే కాల్ చేసింది ?, మధ్యలో పోలీసుల పాత్ర ఏమిటి ?, రేడియో స్టేష‌న్ నుంచి లైవ్‌లో ఆ అమ్మాయిని ఎక్క‌డ ఉంచార‌నే స‌మాచారాన్ని నిల‌య్ ఎలా సేక‌రించాడు ?, ఈ అమ్మాయికి చనిపోయిన అవంతికకు ఉన్న సంబంధం ఏమిటి ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్లు:

సింగిల్ క్యారెక్ట‌ర్ తో థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియ‌న్స్‌ను పంచుతూ సాగిన ఈ చిత్రంలో మెయిన్ థీమ్ తో పాటు కొన్ని ఎమోషనల్ సీన్స్ మరియు క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ బాగున్నాయి. ఇక సుమంత్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. కొన్ని సన్నివేశాల్లో తన పాత్రకు తగ్గట్టుగా చాలా వేరియేషన్స్ ప్రదర్శించాడు. అలాగే తన ఎమోషనల్ యాక్టింగ్ తో కూడా సుమంత్ బాగానే అలరించాడు. ఆయన పాత్ర చిత్రీకరణ కూడా బాగుంది. పైగా కొన్ని కీలక సన్నివేశాలు కూడా సినిమాపై ఆకర్షణను పెంచుతాయి. అదనంగా, కొన్ని చోట్ల సంగీతం కూడా బాగా కుదిరింది.

పైగా ఈ మూవీ క‌థ మొత్తం ఒకే క్యారెక్ట‌ర్ తో ఒకే రూమ్‌లో ఓ రేడియో షో బ్యాక్‌డ్రాప్‌లో సాగినా.. ఇంట్రెస్ట్ ను మాత్రం దర్శకుడు కొన్ని చోట్ల బాగానే మెయింటైన్ చేశాడు. మొత్తానికి సైక‌లాజిక‌ల్ రివేంజ్ థ్రిల్ల‌ర్‌గా ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ సాగ‌ర్ అట్లూరి ఈ అహం రీబూట్ మూవీని బాగానే మలిచాడు. త‌న స్నేహితురాలి మ‌ర‌ణం వెనుక ఉన్న నిజాల‌ను ఓ యువ‌తి కిడ్నాప్ డ్రామా ద్వారా ఎలా బ‌య‌ట‌పెట్టింది? అనే కోణంలో సాగిన మెయిన్ డ్రామా కూడా బాగుంది.

మైనస్ పాయింట్లు:

ఈ చిత్ర కథాంశాన్ని చదివిన తర్వాత మరియు ఆన్‌లైన్‌లో ట్రైలర్‌ను చూసిన తర్వాత, ఈ చిత్ర కథాంశంతో పాటు స్క్రీన్ ప్లే కూడా చాలా చోట్ల ఊహించిన విధంగానే సాగుతుంది. అదే ఇంట్రెస్టింగ్ కథనాన్ని జోడించి, హీరో పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా కాన్ ఫ్లిక్ట్ ను పెంచుతూ స్క్రీన్ ప్లేను నడిపి ఉంటే.. సినిమా ఇంకా బెటర్ గా ఉండి ఉండేది. అదే విధంగా ఆకట్టుకునే సన్నివేశాలను పెట్టి, ఆకట్టుకునే సంభాషణలను చొప్పించి ఉండి ఉంటే.. ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యేది.

కానీ, దర్శకుడు ఈ సినిమాను ఆ విధంగా ఎలివేట్ చేయలేకపోయాడు. మరోవైపు, సుమంత్ పనితీరు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ, అతను పై చాలా సన్నివేశాలు చాలా రెగ్యులర్ గా సాగాయి. ఎలాగూ సహాయక తారాగణం కూడా లేదు. పైగా సినిమా మొత్తం సింగిల్ క్యారెక్టర్. ఈ లోటు సినిమాలో బాగా కనిపించింది. సింగిల్ క్యారెక్ట‌ర్‌తో తెర‌కెక్కిన ప్ర‌యోగాత్మ‌క సినిమాగా ఈ సినిమాకి గుర్తింపు అయితే వస్తోంది గానీ, ఇంట్రెస్టింగ్ సినిమాగా మాత్రం ఈ సినిమా అనిపించదు.

మొత్తానికి, త‌ప్పు చేశాన‌ని ప‌శ్చాత్తాపంతో ర‌గిలిపోతున్న ఓ ఆర్జే, ఆ అప‌రాధ భావం నుంచి బ‌య‌ట‌ప‌డి ఎలా కొత్త జీవితాన్ని మొద‌లుపెట్టాడు అనే కోణం ఆకట్టుకున్నా.. ఆ కోణాన్ని ఆవిష్కరించిన విధానం మాత్రం ఆసక్తికరంగా లేదు. స్క్రిప్టు ఇంకా బెటర్ గా ఉండి ఉంటే బాగుండేది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు ప్రశాంత్‌ సాగర్‌ అట్లూరి మంచి పాయింట్ ను మరియు ప్రతిభావంతుడైన లీడ్ ని ఎంచుకున్నాడు కానీ, మరింత ఆకర్షణీయమైన స్క్రీన్‌ప్లే ను మాత్రం రాసుకోలేకపోయాడు. ఇక శ్రీరామ్‌ మద్దూరి సంగీతం బాగానే ఉంది. కానీ గుర్తుండిపోయేలా ఆయన సంగీతం మాత్రం లేదు. కొన్ని సన్నివేశాలను ఇంకా బెటర్ గా ఎడిట్ చేసి ఉండవచ్చు. వరుణ్‌ అంకర్ల సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. రఘువీర్‌ గోరిపర్తి, సృజన్‌ యరబోలు నిర్మాణ విలువలు కథకు తగ్గట్టు ఉన్నాయి.

తీర్పు:

మొత్తమ్మీద, సింగిల్ క్యారెక్ట‌ర్‌తో తెర‌కెక్కిన ప్ర‌యోగాత్మ‌క సినిమాగా ఈ ‘అహం రీబూట్‌’ కొన్ని చోట్ల థ్రిల్లింగ్ ఎక్స్‌ పీరియ‌న్స్‌ను పంచినా, సినిమా మాత్రం మెప్పించలేకపోయింది. రెగ్యుల‌ర్ రివేంజ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మరియు బోరింగ్ ప్లే అండ్ వీక్ ట్రీట్మెంట్ వంటి అంశాలు ఈ సినిమాకి మైనస్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమా ఆకట్టుకోదు. కానీ, ప్ర‌యోగాత్మ‌క సినిమాలు ఇష్ట పడేవారికి ఈ చిత్రంలో కొన్ని అంశాలు కనెక్ట్ అవుతాయి.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు