“అహింస” టీవీ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్!


టాలెంటెడ్ డైరెక్టర్ తేజ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం అహింస థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించడం లో విఫలం అయ్యింది. ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ అయిన జెమిని టీవీ సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

డిసెంబర్ 10, 2023 న మధ్యాహ్నం 12:00 గంటలకి ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అభిరామ్ దగ్గుబాటి, గీతికా తివారి, రజత్ బేడి, కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఆర్పీ పట్నాయక్ సంగీతాన్ని అందించారు. ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై పి. కిరణ్ నిర్మించిన ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Exit mobile version