సమీక్ష : “అహో విక్రమార్క” – బోరింగ్ యాక్షన్ డ్రామా

సమీక్ష : “అహో విక్రమార్క” – బోరింగ్ యాక్షన్ డ్రామా

Published on Aug 31, 2024 1:02 AM IST
Aho Vikramaarka Movie Review in Telugu

విడుదల తేదీ : ఆగస్టు 30, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: దేవ్ గిల్, చిత్ర శుక్ల, పోసాని కృష్ణ మురళి, సాయాజీ షిండే, ప్రవీణ్ టర్డే, తేజస్విని పండిట్.

దర్శకుడు: పేట త్రికోటి

నిర్మాతలు : ఆర్తి దేవ్ గిల్, మీహిర్ కులకర్ణి, అశ్విని కుమార్ మిశ్ర

సంగీత దర్శకుడు: రవి బసృర్

సినిమాటోగ్రఫీ: కరం చావ్లా, గురు ప్రసాద్ ఎన్

ఎడిట‌ర్ : తమ్మిరాజు

సంబంధిత లింక్స్: ట్రైలర్

టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ “మగధీర” లో విలన్ గా మెప్పించిన టాలెంటెడ్ నటుడు దేవ్ గిల్ హీరోగా పరిచయం అవుతూ చేసిన లేటెస్ట్ పాన్ ఇండియా యాక్షన్ సినిమానే “అహో విక్రమార్క”. మరి నేడు థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ఇక కథలోకి వస్తే.. ఈ సినిమా నేపథ్యం అంతా పూణేలో సెట్ చేయబడింది. అక్కడ పార్వతి స్లమ్ అనే ప్రాంతంలో కొంచెం బలంగా ఉన్న జనాన్ని పని పేరిట కొందరు దండకా అనే ప్రాంతానికి తీసుకెళ్తారు. కానీ అక్కడికి వెళ్లిన వాళ్ళు ఏళ్ళు గడుస్తున్నా వెనక్కి రారు. ఇక అదే ప్రాంతానికి ఎస్సై గా విక్రమార్క(దేవ్ గిల్) వస్తాడు. కరప్టెడ్ పోలీస్ అయ్యినటువంటి తాను మనిషిగా మారి ఆ పార్వతి స్లమ్ నుంచి తీసుకెళ్ళబడ్డ జనాన్ని ఎలా వెనక్కి తీసుకొస్తాడు? అసలు దండకా అనే ప్రాంతం ఏంటి దానిని రూల్ చేస్తున్న అసుర (ప్రవీణ్ టర్డే) ఎవరు? అక్కడికి జనాన్ని తీసుకెళ్లి ఏం చేస్తున్నారు? ఈ నేపథ్యంలో తన ప్రేయసి అర్చన (చిత్ర శుక్ల) పాత్ర ఏంటి? అసలు ఈ విక్రమార్క ఎవరు అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూడాలి.

ప్లస్ పాయింట్స్:

మొదటిగా హీరో దేవ్ గిల్ కోసం మాట్లాడినట్టు అయితే ఇన్నేళ్లు విలన్ గా ఒక యాంగిల్ లో మాత్రమే కనిపించిన తాను ఈ చిత్రంలో హీరోగా కూడా మంచి షేడ్ ని ప్రదర్శించాడు అని చెప్పాలి. మెయిన్ గా తనపై మాస్ మూమెంట్స్ బాగున్నాయి. సాలిడ్ ఫిజిక్ తో దేవ్ అయితే అదరగొట్టాడు అని చెప్పాలి. అలాగే తన నటన పలు ఎమోషనల్ సీన్స్ ని బాగా చేసాడు. ఇంకా డాన్స్ కూడా తన నుంచి బాగుంది.

ఇక నటి చిత్ర శుక్ల డీసెంట్ పాత్రలో కనిపించింది. తన లుక్స్ బాగున్నాయి. ఆన్ స్క్రీన్ హీరో పక్కన సెట్ అయ్యింది. ఇంకా నెగిటివ్ షేడ్స్ లో కనిపించిన అసుర పాత్రదారుడు ప్రవీణ్ టర్డే సాలిడ్ విలనిజాన్ని చూపించాడు తన రోల్ లో అతని పెర్ఫామెన్స్ బాగుంది. అలాగే కాలకేయ ప్రభాకర్, తేజస్విని పండిట్ తదితరులు తమ రోల్స్ లో తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకుంటారు. ఇక సినిమాలో రవి బసృర్ ఇచ్చిన స్కోర్ పలు సీన్స్ ని ఎఫెక్టీవ్ గా చూపించింది. ఇంటర్వెల్ బ్లాక్ ఫైట్ సీక్వెన్స్ బాగుంది.

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రంలో డిజప్పాయింట్ చేసే అంశాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి. స్టార్టింగ్ లో ఒకటి రెండు నిమిషాలు బాగానే ఉంది అనిపిస్తుంది కానీ అక్కడ నుంచి పరమ రొటీన్ నరేషన్ తో సినిమా కొనసాగుతుంది. అవే హీరో హీరోయిన్ ఎంట్రీ సీన్స్, సిల్లీ ప్రేమకథ లైన్ ఇంకా ఒక ప్రాంతానికి జనాన్ని తీసుకెళ్ళిపోయి అక్కడ వారిని హింసిస్తూ కనిపించే క్రూరమైన విలన్లు ఎవరైనా బయటకి పారిపోయే ప్రయత్నం చేసిన పనికి పనికిరారు అని తెలిసినా చంపెయ్యటం కేజీయఫ్ లో చూసేసాం.

ఇక హీరో క్యారక్టరైజేష్ ని చూస్తే ఒక టెంపర్, ఒక పటాస్ సినిమాలు గుర్తు రాక మానవు. ఇలా ఈ చిత్రం చాలా మాస్ సినిమాలు కలిపి కొట్టినట్టుగా అనిపిస్తుంది. దీనితో ఈ చిత్రం ఒకింత బోరింగ్ అండ్ డల్ గా అనిపిస్తుంది. ఇక ఓకే పర్లేదు అనిపించే ఫస్టాఫ్ తర్వాత సెకండాఫ్ ఆడియెన్స్ సహనాన్ని పరీక్షిస్తుంది అని చెప్పాలి. చాలా ఓవర్ సీన్స్ ని లాజిక్ లేకుండా చూపించేసారు.

హీరోని మాస్ గా చూపించడానికి అనవసరపు హంగులు జోడించి నాచురాలిటీ సెకండాఫ్ లో తగ్గించేశారని చెప్పాలి. ఇక కొన్ని ట్విస్ట్ లు కథనం ని మనం చాలా ముందే ఊహించేయవచ్చు. సో సినిమా ఏమి పెద్ద ఎగ్జైటింగ్ గా ఏమి అనిపించదు. ఇంకా క్లైమాక్స్ పోర్షన్ కూడా చాలా వీక్ గా అనిపిస్తుంది. పాటలు కూడా సినిమాలో బాగోలేవు కొన్నిటిని అయితే అనవసరంగా ఇరికించారు. ఇంకా ప్రీ క్లైమాక్స్ లో సెంటిమెంట్ ఎక్కడా వర్కౌట్ పైగా ఆ సీన్స్ చూస్తే బాగా ఓవర్ గా చేస్తునట్టు అనిపిస్తుంది. సో ఇవి కూడా వర్కౌట్ కాలేదు.

సాంకేతిక వర్గం:

ఇక ఈ చిత్రంలో నిర్మాణ విలువలు రిచ్ గా కనిపిస్తాయి. యాక్షన్ పార్ట్ డిజైన్ బాగుంది. పాటలు బిలో యావరేజ్ గా ఉన్నాయి. కానీ చాలా సీన్స్ లో అయితే సంగీత దర్శకుడు రవి బసృర్ ఇచ్చిన స్కోర్ మాత్రం ఓ రేంజ్ లో ఉంది. చాలా సీన్స్ లో మంచి స్టైలిష్ స్కోర్ ని అందించి వాటిని ఎలివేట్ చేసాడు. ఇంకా సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటింగ్ లో చాలా సీన్స్ ట్రిమ్ చేయాల్సింది. సెకండాఫ్ లో రెండు పాటలు తీసేయాల్సింది.

ఇక దర్శకుడు పేట త్రికోటి విషయానికి వస్తే.. తాను దర్శకుడిగా చాలా బిలో యావరేజ్ వర్క్ ని అందించారు అని చెప్పాలి. తాను చాలా రొటీన్ నేపథ్యాన్ని ఎంచుకున్నారు కానీ కథనాన్ని అయినా కొంచెం డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయాల్సింది. చాలా మాస్ సినిమాలు అన్నీ కలిపి చేసిన మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లా ఈ సినిమా అనిపిస్తుంది. విలన్లు, హీరో క్యారక్టరైజేషన్ వంటివి పరమ రొటీన్ గా చాలా వీక్ గా కనిపిస్తాయి. దేవ్ పై కొన్ని మాస్ సీన్స్ అండ్ యాక్షన్ సీన్స్ బాగున్నాయి కానీ మిగతా సినిమా అంతా చాలా వీక్ గా తాను తెరకెక్కించారు.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “అహో విక్రమార్క” చిత్రంలో హీరోగా దేవ్ గిల్ ఇంప్రెస్ చేస్తాడు. తన పర్శనాలిటీ, పెర్ఫామెన్స్ లు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ మాస్ ఆడియెన్స్ ని ఓకే అనిపిస్తాయి. కానీ సినిమాలో అసలు సరైన కథ, కథనాలు లేవు. చాలా రొటీన్ కథాంశం, స్క్రీన్ ప్లే లతో దర్శకుడు ఈ చిత్రాన్ని నడిపించాడు. పైగా వర్కౌట్ కాని ఎమోషన్స్, సెకండాఫ్ సినిమా చూసే ఆడియెన్స్ ని నిరుత్సాహపరుస్తాయి. వీటితో అయితే ఈ చిత్రం ఒక బోరింగ్ మాస్ డ్రామాగా మిగిలిపోయింది.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు