బాలీవుడ్ స్టార్ జంట అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకులు తీసుకుంటున్నారనే వార్త చాలా రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. పైగా ఈ రూమర్స్ కి బలం చేకూర్చేలా అనంత్ అంబానీ పెళ్లిలో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడివిడిగా ఫోటోలకు ఫోజులవ్వడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. ఐతే, రీసెంట్ గా అక్టోబర్ 22న ఐశ్వర్య రాయ్, తన తల్లి, తన కుమార్తె ఆరాధ్యతో సహా తన కుటుంబంతో.. తన కజిన్ పుట్టినరోజు పార్టీలో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఆ సందర్భంగా దిగిన ఫోటోలను కూడా ఐశ్వర్యారాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
ఐతే, ఈ ఫోటోలో ఐశ్వర్య రాయ్ భర్త అభిషేక్ బచ్చన్ కనిపించకపోవడంతో.. వీరి విడాకుల వార్త మళ్లీ వైరల్ అయింది. పైగా విడాకుల వార్తలకు కూడా మరింత బలం చేకూరింది. కానీ, వీరి విడాకుల వార్తలు కేవలం రూమర్స్ మాత్రమే అని చెప్పడానికి ఓ ఉదాహరణ ఉంది. ఐశ్వర్యారాయ్ కి సోషల్ మీడియాలో పాపులారిటీ ఎక్కువ. పైగా ఐశ్వర్య రాయ్ ని 14.3 మిలియన్ల మందికి పైగా ఫాలో అవుతున్నారు. మరి ఐశ్వర్య రాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవర్ని ఫాలో అవుతుందో తెలుసా ?, కేవలం 1 వ్యక్తిని మాత్రమే ఆమె అనుసరిస్తోంది. ఆ వ్యక్తి తన భర్త అభిషేక్ బచ్చనే. కాబట్టి, వీరి విడాకుల వార్తలు రూమర్స్ అని అర్ధం అవుతుంది.