ప్రస్తుతుం క్రికెట్ అభిమానులు ఐపీఎల్ 2025 ఫీవర్‌తో ఊగిపోతున్నారు. ఇప్పటికే ఈ టోర్నీలో చాలా ఆసక్తికర మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇక తమ అభిమాన క్రికెటర్ల ఆటను చూసేందుకు అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, క్రికెట్ ప్లేయర్స్‌కు కేవలం కామన్ పబ్లిక్ మాత్రమే కాకుండా సెలెబ్రిటీలు సైతం అభిమానులుగా ఉంటారు. తాజాగా ఓ స్టార్ క్రికెటర్‌తో తన ఫ్యాన్ మూమెంట్ చూపెట్టింది ఓ హీరోయిన్.
ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది అందాల భామ ఐశ్వర్య రాజేష్. ఈ బ్యూటీ తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ ఎం.ఎస్.ధోనితో సెల్ఫీ దిగింది. ఈ ఫోటోలను ఆమె తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది. తన అభిమాన క్రికెటర్‌తో ఫోటో దిగడం తనకు ఎంతో సంతోషంగా ఉందంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.