విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కొలాబరేషన్లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. జనవరి 14న ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాల్ని పంచుకున్నారు.
ఈ ప్రాజెక్ట్‌లోకి ఎలా వచ్చారు? ఈ మూవీ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది?
‘సుడల్’ వెబ్ సిరిస్ షూటింగ్ లో ఉన్నప్పుడు డైరెక్టర్ అనిల్ రావిపూడి గారి నుంచి కాల్ వచ్చింది. ఓ క్యారెక్టర్ కి లుక్ టెస్ట్ చేయాలని అన్నారు. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఆయన సినిమాలన్నీ చూశాను. ఇందులో నా క్యారెక్టర్ కి ఒక యాస ఉంది. ఆ యాసతో పాటు ఆ లుక్ టెస్ట్ కోసం హైదరాబాద్ వచ్చాను. ఓ డైలాగ్ ఇచ్చారు. రెండు లైన్స్ చెప్పగానే చాలని చెప్పి స్క్రిప్ట్ ని నరేట్ చేశారు. నరేషన్ లో పడిపడి నవ్వుకున్నాను. నా కెరీర్లో ఇంత ఎంజాయ్ చేసి విన్న స్క్రిప్ట్ ఇదే. భాగ్యం క్యారెక్టర్ కోసం చాలా వెదికారు. ఆ పాత్ర నాకు దక్కడం ఆనందంగా ఉంది.
– ఇప్పటివరకు చాలా సినిమాలు చేశాను. ‘సంక్రాంతికి వస్తున్నాం’ నాకు చాలా స్పెషల్. గోదారి గట్టు పాట అందరికీ రీచ్ అయ్యింది. నేను ఎయిర్‌పోర్ట్‌లో కనిపిస్తే ప్రతి ఒక్కరూ నాతో ఫోటో తీసుకుంటున్నారు. అది ఆ పాటకి వచ్చిన రీచ్. ఆ సాంగ్ ఒక వైల్డ్‌ఫైర్‌లా పాకింది.
– తెలుగులో నాకు ఇప్పటివరకు సరైన డ్యూయెట్ సాంగ్ పడలేదు. ఆ లోటు ‘గోదారి గట్టు’ పాటతో తీరింది. వెంకటేష్ గారు లాంటి బిగ్ హీరోతో ఇంత అద్భుతమైన సాంగ్ చేయడం అది ఇంత వైరల్ హిట్ కావడం ఆనందంగా ఉంది. అలాగే సినిమాలో పాటన్నీ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. పాటలు హిట్ అయితే సగం పాసైపోయినట్లే. ట్రైలర్ ఆ అంచనాలని మరింతగా పెంచింది. ఇది అందరూ ఎంజాయ్ చేసే సినిమా.
వెంకటేష్ గారితో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది?
బిగినింగ్‌లో చాలా భయం వేసింది. ఎందుకంటే భాగ్యం.. మామూలు క్యారెక్టర్ కాదు. కత్తిమీద సాములాంటి క్యారెక్టర్. కొంచెం బ్యాలెన్స్ తప్పినా కష్టమే. ఇంతకుముందు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. ఆడియన్స్ చుస్తున్నప్పుడు జాలి పుట్టే క్యారెక్టర్. చాలా క్రూషియల్ రోల్. కాస్త శ్రుతిమించినా ఓవర్ డోస్ అయిపోతుంది. భాగ్యం పాత్రని అర్ధం చేసుకోవడానికి నాకు పదిరోజులు పట్టింది.
– భాగ్యం లాంటి క్యారెక్టర్ ఐదారేళ్ళుగా తెలుగు సినిమాల్లో చూడలేదు. చాలా ఫ్రెష్ రోల్. ఇలాంటి ఫ్యామిలీ ఫీల్ గుడ్ సినిమా వచ్చి చాలా రోజులైయింది. అందరూ కనెక్ట్ చేసుకునే సినిమా ఇది. అనిల్ గారు చాలా క్రియేటివ్ గా ఈ కథని చెప్పారు.
మీనాక్షి చౌదరితో యాక్ట్ చేయడం గురించి?
మీనాక్షి చాలా సింపుల్. తనకి నాకు దగ్గర పోలికలు. డాక్టర్ చదువుకుంది. కష్టపడి పైకి వచ్చింది. తను చాలా స్వీట్. తనకి నాకు మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. మీను సాంగ్ లో తప్పితే.. వెంకటేష్ గారు నేను మీనాక్షి .. ముగ్గురూ సినిమా అంతా ట్రావెల్ అవుతాం. మా ముగ్గురిని చూడాల్సిందే. ఇందులో వెంకీ గారిది మా ఇద్దరి మధ్య నలిగిపోయే క్యారెక్టర్.
దిల్ రాజు గారి నిర్మాణంలో చేయడం ఎలా అనిపించింది?
దిల్ రాజు, శిరీష్ గారి బ్యానర్ లో వర్క్ చేయడం నైస్ ఎక్స్ పీరియన్స్.
మీ కథల ఎంపిక ఎలా ఉంటుంది?
సినిమాలో చేసే అవకాశం అందరికీ రాదు. అదొక అదృష్టం. భిన్నమైన కథలు చెప్పడానికి సినిమా గొప్ప వేదిక. నా వరకూ డిఫరెంట్ రోల్స్ చేయడానికి ఇష్టపడతాను. ఏ పాత్ర చేసినా సోషల్ రెస్పాన్స్ బిలిలిటీ వుండాలని కోరుకుంటాను.