ధనుష్‌తో విడాకుల తర్వాత ఐశ్వర్య ఆసక్తికర కామెంట్స్..!

ధనుష్‌తో విడాకుల తర్వాత ఐశ్వర్య ఆసక్తికర కామెంట్స్..!

Published on Feb 18, 2022 3:00 AM IST

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్‌లు విడిపోయిన సంగతి తెలిసిందే. 18 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ ఇద్దరూ విడిపోతున్నట్లు జనవరిలో సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే విడాకుల తర్వాత మొదటిసారి ధనుష్ భార్య ఐశ్వర్య స్పందించింది. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ జీవితంలో ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరికీ ఆటుపోట్లు ఎదురవుతాయని, వాటిని తప్పకుండా ఎదురుకోవాలని అన్నారు.

అంతేకాదు ప్రేమ అనేది అద్భుతమైన భావవ్యక్తీకరణ అని, ఒకరి భావాలను మరొకరు వ్యక్తపరుచుకోవడం. ప్రేమ అనేది ఒక వ్యక్తికో, వస్తువుకో సంబంధించింది కాదు. నేను ఎదిగేకొద్దీ నా మనసులో ప్రేమ నిర్వచనం కూడా మారుతూ వచ్చిందని అన్నారు. అయితే నేను నా తల్లిదండ్రులను, నా పిల్లలను ప్రేమిస్తున్నానని, ఒక వ్యక్తితోనే ప్రేమ ఆగిపోదని చెప్పుకొచ్చింది. అయితే ఎక్కడా ధనుష్ ప్రస్తావన తీసుకురాకపోవడం, ఒక వ్యక్తితోనే ప్రేమ ఆగిపోదు అని ఐశ్వర్య మాట్లాడడం చూస్తుంటే ఇక వీరిద్దరు మళ్లీ కలిసే ఛాన్స్ లేనట్టే అని అర్ధమవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు