SDT18 కోసం ‘విరూపాక్ష’ కాంబో ఫిక్స్!

SDT18 కోసం ‘విరూపాక్ష’ కాంబో ఫిక్స్!

Published on Oct 26, 2024 5:42 PM IST


సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘SDT18’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను దర్శకుడు రోహిత్ కెపి డైరెక్ట్ చేస్తుండగా భారీ బడ్జెట్ చిత్రంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియోకి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది.

అయితే, తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ సాలిడ్ అప్డేట్‌న మేకర్స్ రివీల్ చేశారు. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందించబోతున్నారు. అజనీష్ సంగీతానికి ప్రత్యేక ఇమేజ్ ఉంది. ‘కాంతార’ వంటి చిత్రానికి సంగీతం అందించింది అజనీష్ కావడం విశేషం. ఇక ‘SDT18’ వరల్డ్‌లో అదిరిపోయే సంగీతం ఆయన ఇస్తారని మేకర్స్
కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

ఈ మేరకు ఓ గ్లింప్స్ ద్వారా అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకు వర్క్ చేయబోతున్నారని మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ సినిమా కోసం సాయి దుర్గ తేజ్ భారీ మేకోవర్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన బీస్ట్ మోడ్‌లో కనిపిస్తాడని రీసెంట్ గ్లింప్స్ వీడియోలో క్లూ ఇచ్చారు. అందాల భామ ఐశ్వర్య లక్ష్మీ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు