అజయ్ దేవగణ్ ” భోళా” కి ఓటిటి లో సూపర్ రెస్పాన్స్!


బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగన్ యొక్క ఇటీవలి భోళా చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. బాక్సాఫీస్ వద్ద కూడా వసూళ్లను రాబట్టడం లో విఫలం అయ్యింది. ఈ చిత్రం హీరో కార్తీ, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ల బ్లాక్‌బస్టర్ ఖైతీ కి అధికారిక రీమేక్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ రీమేక్ కోసం అజయ్ దేవగన్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది.

భోళా చిత్రానికి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రైమ్ వీడియో యొక్క ఇండియా చార్ట్‌లలో ఈ సినిమా మొదటి స్థానంలో ట్రెండ్ అవుతోంది. రాబోయే రోజుల్లో కూడా భోళా సాలిడ్ ట్రాఫిక్‌ను పెంచుతుందని భావిస్తున్నారు. ఈ రీమేక్ వెర్షన్‌లో అజయ్ దేవగన్ కీలకమైన మార్పులు చేశారు. ఈ యాక్షన్ డ్రామాలో టబు, అమలా పాల్ కీలక పాత్రలు పోషించారు. అజయ్ దేవగన్ ఎఫ్ ఫిల్మ్స్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్, టి సిరీస్ మరియు రిలయన్స్ ఎంటర్టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ బిగ్గీని బ్యాంక్రోల్ చేశాయి. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతం అందించారు.

Exit mobile version