టాలీవుడ్ లో ఇటీవల రిలీజ్ అయిన ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ఈ సినిమాలో అజయ్ ఘోష్, చాందినీ చౌదరిలు ముఖ్య పాత్రల్లో నటించారు. శివ పాలడుగు డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఓటిటిలోనూ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఈటీవీ విన్ ప్లాట్ ఫామ్ లలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఓటిటిలో ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.
ఈ సందర్భంగా నటుడు అజయ్ ఘోష్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు పేరుపేరునా కృతజ్ఞతలు. ఈ సినిమాలో నటించిన నటీనటులందరూ ఎంతో కో-ఆపరేటివ్ గా పని చేశారు. నన్ను తెలుగు తెరపై చూపించిన మొదటి దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ గారు ఈ సినిమా చూసి నాకు స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. ఈ సినిమా కథను నమ్మి డబ్బు పెట్టిన నిర్మాతలకు సెల్యూట్. శివ సినిమాను బాగా రూపొందించారు. డైరెక్షన్ స్టాఫ్ మొత్తానికి కృతజ్ఞతలు.’ అని అన్నారు.
హీరోయిన్ చాందినీ చౌదరి మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కథ విన్నప్పుడే దీనిపై నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఆడియన్స్ అందరికీ థాంక్స్. ఈ సినిమా ప్రతి ఏజ్ గ్రూప్ కి కనెక్ట్ అయ్యే సినిమా. డైరెక్టర్ శివ గారితో పాటు ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మ్యూజిక్ డైరెక్టర్ పవన్ మంచి సంగీతం అందించారు. డీవోపీ గారికి స్పెషల్ థాంక్స్’ అని అన్నారు.
ఇక చీఫ్ గెస్ట్ గా వచ్చిన తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు అజయ్ ఘోష్ ని పెట్టి సినిమా తీసుకున్నారు. వీళ్ళ పని అయిపోయినట్లే అనుకున్నా. కానీ రీసెంట్ గా ఈ సినిమాను చూశాను. 40 నిమిషాల సినిమా చూశాక మతిపోయింది. చివర్లో అయితే ఈ సినిమా సీన్స్ చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. ఈ రోజుల్లో సోషల్ మీడియా వచ్చింది. మౌత్ పబ్లిసిటీతో సినిమా సక్సెస్ అవుతోంది. సినిమా సక్సెస్ అయింది కానీ ఈ సినిమాతో వీళ్ళకు డబ్బులు వచ్చాయని అయితే నేను నమ్మను. మంచి సినిమాను ఎంకరేజ్ చేయండి. చిన్న సినిమాలకు మీడియా వాళ్ళ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. ఇలాగే సపోర్ట్ చేయండి. అని అన్నారు.
చిత్ర డైరెక్టర్ శివ మాట్లాడుతూ.. ‘నా మొదటి సినిమా ఇది. ఈ సినిమా తీశాక సినిమా ఎలా తీయాలి. కష్ట నష్టాలు ఏంటి అనేది ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ముందు ముందు ఇంకా మంచి సినిమాలు తీస్తా’ అని అన్నారు.
ఇక మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాలో ఆమని, అమిత్ శర్మ, భాను చందర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.