టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలతో విజయ్, అజిత్ లు.!

టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలతో విజయ్, అజిత్ లు.!

Published on Jan 31, 2024 10:04 AM IST


ఇప్పుడు ఇండియన్ సినిమా అంతా కూడా ఒక్కటిగా మారింది. ఆయా ఇండస్ట్రీలకి చెందిన దర్శకులు హీరోలు ఇతర ఇండస్ట్రీ వారితో కలిసి వర్క్ చేయడం మరింత ఎక్కువ కావడంతో ఇప్పుడు ఇండియన్ సినిమా అంతా ఒక్కటే అన్నట్టుగా మారిపోయింది. అలా మన దగ్గర కూడా కోలీవుడ్ హీరోస్ తో టాలీవుడ్ దర్శకులు నిర్మాతలు అలాగే తమిళ దర్శకుడు మన తెలుగు హీరోస్ తో సినిమాలు చేస్తున్నారు.

అలా ఇప్పుడు కోలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ ఇద్దరూ కూడా మన టాలీవుడ్ లో బాగా నిర్మాణ సంస్థలతో సినిమాలు చేస్తున్నట్టుగా ఇపుడు ఆసక్తిగా మారింది. అలాగే థలా అజిత్ కుమార్ తో మన టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ అండ్ భారీ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని చేయనున్నారని తెలిసిందే.

ఇక లేటెస్ట్ గా దళపతి విజయ్ తో సెన్సేషనల్ ప్రొడక్షన్ హౌస్ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు కూడా భారీ చిత్రాన్ని చేస్తున్నట్టుగా ఇప్పుడు వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. దీనితో టాలీవుడ్ లో రెండు బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ లు తమిళ్ ఇద్దరు బిగ్ స్టార్స్ తో సినిమాలు చేయడం అనేది ఆసక్తిగా మారింది. ఇక వీటిపై అఫీషియల్ క్లారిటీ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు